మొత్తానికి రేవంత్ ను సీఎం ను చేసేస్తున్న కేసీఆర్ ! 

నిన్న వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) ఫలితాలు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు పెద్ద షాక్ నే కలిగించాయి.

ఊహించని విధంగా కాంగ్రెస్ బలం పుంజుకోవడం, ఎన్నికల్లో ప్రభావం చూపించడంతో బిఆర్ఎస్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

ముఖ్యంగా కాంగ్రెస్ ను కేసీఆర్ తక్కువ అంచనా వేయడం, మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తామనే ధీమా మితిమీరడం ఇవన్నీ బీఆర్ఎస్ ఓటమిలో భాగస్వామ్యం అయ్యాయి.

అసలు తెలంగాణ కాంగ్రెస్ కు ఈ స్థాయిలో ఊపు రావడానికి,  ఆ పార్టీ ఎన్నికలలో విజయం సాధించడానికి కారణం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేది అందరూ ఒప్పుకోవాల్సిందే.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రాష్ట్రమంతా పర్యటించడం,  పార్టీలో గ్రూపు రాజకీయాలను చక్కదిద్ది నాయకులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసే విధంగా ప్రయత్నాలు చేయడంలో సక్సెస్ కావడం ఇవన్నీ కలిసి వచ్చాయి.

"""/" / అసలు తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు ఎంతోమంది ఉన్నా,  టిడిపి నుంచి కాంగ్రెస్ చేరిన రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి దక్కడంతో పాటు,  ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్న అభిప్రాయాలు ఏర్పడడానికి ప్రధాన కారణం కెసిఆర్ అనే చెప్పుకోవాలి.

రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది.దాదాపు రేవంత్ రెడ్డి పై తెలంగాణలో 80 పైగా కేసులు ఉన్నాయి.

ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరుక్కోవడంతో దానిని టార్గెట్ చేసుకుని రేవంత్ ను రాజకీయాల నుంచి తప్పుకునేలా కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు.

సాధారణ జడ్పిటిసి స్థాయి నుంచి రేవంత్ ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిగా ఎదగడానికి పరోక్షంగా కేసీఆర్( CM Kcr ) వైకిరే కారణం.

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అరెస్టు కావడం, రేవంత్ కుమార్తే పెళ్లికి 12 గంటలు పాటు బెయిల్ పై బయటకు వచ్చి పెళ్ళికి హాజరై మళ్ళీ జైలుకు వెళ్లాల్సి రావడం ఇవన్నీ రేవంత్ పై ప్రజలో సానుభూతిని విపరీతంగా పెంచాయి.

అంతేకాదు అనేక కేసుల్లో రేవంత్ ను టార్గెట్ చేసుకుని అరెస్టు చేయించేందుకు ప్రయత్నించడం ఇవన్నీ రేవంత్( Revanth Reddy ) గ్రాఫ్ ను అమాంతం పెంచాయి.

"""/" / అసలు తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) పని అయిపోయిందని అంతా భావిస్తున్న సమయంలో పదేపదే రేవంత్ ను కాంగ్రెస్ ను కెసిఆర్ కేటీఆర్ లు టార్గెట్ చేసుకోవడం పెద్ద ఎత్తున విమర్శలు చేయడం ఇవన్నీ రేవంత్ కు కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చాయి.

రేవంత్ ప్రతి విషయంలోనూ కేసీఆర్ ను ఇరుక్కుని పెట్టేలా విమర్శలు చేయడం దానికి కౌంటర్ గా ప్రతి విమర్శలు చేయడంతో పాటు రేవంత్ పై కేసులు నమోదు చేయడం వంటివన్నీ రేవంత్ కు ప్రజలలో సానుభూతి పెరిగేలా చేసింది.

అంతేకాకుండా బీఆర్ఎస్ ను ఎదుర్కొని ఆ పార్టీని ఓడించగల సత్తా రేవంత్ కు మాత్రమే ఉందని కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తించేలా పరోక్షంగా కేసీఆర్ చేశారు.

రేవంత్ ను రాజకీయంగా అనిచివేయలి అనే ధోరణితో ఉంటూ కేసీఆర్( CM Kcr ) రావడం రేవంత్ గ్రాఫ్ పెరిగేలా చేసింది అనడం లో సందేహం లేదు.

రేవంత్ కనుక తెలంగాణ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తే ఆ క్రెడిట్ లో కేసీఆర్ కూ మెజార్టీ  భాగస్వామ్యం ఉంటుంది.

ఇక దబిడి దిబిడే.. భారత్ లో కాలుమోపిన HMPV వైరస్