అఖిల్ డేరింగ్ స్టెప్.. ఒకేసారి రెండు.. వర్కౌట్ అయ్యేనా?

అక్కినేని అఖిల్( Akhil Akkineni ) కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో ఏళ్ళు అవుతున్న ఇప్పటికి సరైన హిట్ మాత్రం పడలేదు.

ఎప్పటికప్పుడు హిట్ అందుకుంటాడు అని అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తుంటే అఖిల్ మాత్రం సినిమా సినిమాకు నిరాశ పరుస్తూనే ఉన్నాడు.

మాస్ ప్రేక్షకులకు దగ్గర అవుదాం అని ఎన్నో హోప్స్ తో అఖిల్ ఏజెంట్ సినిమాను చేసాడు.

పూర్తిగా లుక్ మార్చేసి బీస్ట్ మోడ్ లోకి మారిపోయాడు.సురేందర్ రెడ్డి( Surender Reddy ) కూడా ఈయనకు హిట్ ఇవ్వలేక పోయాడు.

కథ కథనాలు తీవ్రంగా నిరాశ పరచడంతో ఈ సినిమా మిగతా సినిమాల కంటే ఘోరంగా విఫలం అయ్యింది.

కనీసం సగం బడ్జెట్ కూడా రాబట్టలేక పోయింది.అయినా కూడా ఈ సినిమా తర్వాత అఖిల్ చేయబోయే నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

"""/" / పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు అఖిల్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉండగా ముందుగా అఖిల్ యూవీ క్రియేషన్స్( UV Creations ) తో సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పై వంశీ, ప్రమోద్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు అని.

ప్రస్తుతం కథ, స్క్రీన్ ప్లే సిద్ధం అవుతుంది అని ఈ సినిమాకు ధీర అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారని టాక్.

మరి ఈ సినిమా నూతన డైరెక్టర్ చేస్తారట. """/" / ఈ సినిమా తర్వాత అఖిల్ నెక్స్ట్ సినిమాను శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala )తో చేస్తాడట.

ప్రజెంట్ ఈయన పెదకాపు సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచాడు.ఈ సినిమాతో మాస్ యాక్షన్ కూడా తీయగలను అని నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ సినిమా రిలీజ్ అయ్యాక అఖిల్ తో సినిమా స్టార్ట్ అవుతుందని అఖిల్ ఈ రెండు ప్రాజెక్టులను ఒకసారి పట్టాలెక్కించి పూర్తి చేయనున్నాడు అని తాజా సమాచారం.

మరి ఈ రెండింటితో అయినా అఖిల్ ట్రాక్ లోకి వస్తాడా రాడా చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్7, సోమవారం 2024