20 ఏళ్ల తర్వాత హీరో వెంకటేష్ తో జతకట్టనున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

సాధారణంగా సినిమాలలో హీరో హీరోయిన్లు జంటగా నటించి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.అయితే కొన్ని కొన్ని సార్లు హీరో హీరోయిన్ కాంబినేషన్లో ఒక హిట్ సినిమా పడింది అంటే మళ్ళీ మళ్ళీ అదే హీరో హీరోయిన్ల కాంబినేషన్ ని కోరుకుంటూ ఉంటారు.

కానీ చాలా వరకు ఒక సినిమా అయిపోగానే మరో సినిమా రాగానే హీరో హీరోయిన్లు ఇద్దరు మారిపోతూ ఉంటారు.

చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ఒకే హీరో హీరోయిన్ల కాంబినేషన్లో తక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి.

అలాంటి క్రేజీ కాంబినేషన్లో హీరో వెంకటేష్ భూమిక కాంబినేషన్ కూడా ఒకటి.అయితే హీరోయిన్ భూమిక,వెంకటేష్ కలిసి ఒక్క సినిమాలో మాత్రమే నటించారు.

"""/" / ఆ సినిమా పేరు వాసు.వాసు సినిమాతో ఈ జంటకు మంచి మార్కులే పడ్డాయి.

2002లో అనగా 20 సంవత్సరాల క్రితం ఇద్దరు కలిసి నటించారు.ఈ సినిమా సక్సెస్ ను సాధించలేకపోయినప్పటికీ భూమిక వెంకటేష్ ల మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

అయితే భూమిక వెంకటేష్ కాంబినేషన్లో ఇంకా ఎక్కువ సినిమాలు వస్తే చూడాలని అభిమానులు ఆశపడినప్పటికీ వాసు సినిమా తర్వాత ఈ జంట కాంబినేషన్లో ఒక సినిమా కూడా రాలేదు.

ఆ తర్వాత మళ్లీ ఒక్కసారైనా నటిస్తారేమో అని ఎంతగానో ఎదురు చూశారు అభిమానులు.

కానీ ఆశలన్నీ కూడా అడియాశలు అయ్యాయి. """/" / ఇది ఇలా ఉంటే 20 ఏళ్ల తర్వాత వెంకటేష్ భూమిక కలిసి జంటగా ప్రేక్షకులను నటించనున్నారు.

కానీ హీరో హీరోయిన్లు గా మాత్రం కాదు.సినిమాలో వీరిద్దరూ జనత గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ వివరాల్లోకి వెళితే.సల్మాన్ ఖాన్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం కిసీ కా భాయ్ కిసీ కా జాన్.

ఈ సినిమా రంజాన్ కానుకగా విడుదల కానుంది.ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి వెంకీ, రానా, జగపతి బాబు కూడా నటిస్తున్నారు.

కాగా తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి బిల్లీ బిల్లీ అనే కొత్త వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

ఇందులో సర్ప్రైజింగ్ గా ఈ సాంగ్ లో వెంకీకి జోడిగా భూమిక ప్రత్యక్షమైంది.

ఈ సాంగ్ లో వీరిద్దరూ జంటగా స్టెప్పులు వేస్తూ కనిపించారు.దీంతో వెంకీ భూమిక వేసిన డ్యాన్సులు చూసి ఆడియన్స్ అవాక్కయ్యారు.

దాదాపు 20 ఇన్నేళ్ల తర్వాత జంటగా కనిపించనున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవిని అనిల్ అలా చూపించనున్నారా.. ఆ సినిమాను మించిన హిట్ గ్యారంటీ!