ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.ఆ దేశ ఉపాధ్యక్షుడు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయి బాంబు దాడులకు పాల్పడ్డారు.
ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ సిటీ బాంబుల మోత తో ద్దరిల్లిపోయింది.ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలే ను లక్ష్యంగా చేసుకొని ఆయన వెళుతున్న కాన్వాయ్‌పై బాంబులతో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.
ఈ క్రమంలో ఆయన క్వానాయ్ ప్రయాణించే మార్గంలో ఓ కల్వర్ట్ కింద పెద్ద ఎత్తున బాంబులు పెట్టి పేల్చేశారు.
అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తు అమ్రుల్లా సలే స్వల్ప గాయాలతోనే బయటపడగా, మరో 15 మందికి పైగా మరణించినట్లు తెలుస్తుంది.
అలానే ఈ ఘటనలో మరో 30 మంది గాయపడినట్లు సమాచారం.ఈ పేలుడు ధాటికి రోడ్డు చుట్టుపక్కల భవనాలు ధ్వంసమవ్వగా,వాహనాలు తునాతునకలయ్యాయి.
అయితే పేలుడు నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అమ్రుల్లా ను సురక్షితంగా అక్కడ నుంచి తరలించినట్లు తెలుస్తుంది.
ఈ ఘటన తరువాత కొద్దిసేపటికి సలే స్వయంగా మీడియా ముందుకు వచ్చి తాను క్షేమంగా ఉన్నానని, ఇది ఒక పిరికిపందల చర్య అంటూ ఆయన మండిపడ్డారు.
మరోపక్క ఈ ఘటన నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలు ప్రారంభించారు అధికారులు.ఈ ఘటనలో గాయపడిన పలువురిని సమీప ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నట్లు సమాచారం.
క్లాస్ స్టెప్స్ తో అదరగొట్టిన ప్రొఫెసర్.. వైరల్ వీడియో