ఆప్ఘనిస్థాన్ కొత్త రూలర్ వచ్చేస్తున్నాడు.. తాలిబన్ లీడర్ అతనే..!

ఆప్ఘనిస్థాన్ కొత్త రూలర్ వచ్చేస్తున్నాడు తాలిబన్ లీడర్ అతనే!

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆఫ్ఘనిస్థాన్ పేరే వినిపిస్తోంది.కేవలం 10 రోజుల్లోనే ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

ఆప్ఘనిస్థాన్ కొత్త రూలర్ వచ్చేస్తున్నాడు తాలిబన్ లీడర్ అతనే!

ఆగస్టు 31వ తేదీన అమెరికన్, నాటో మిలటరీలు ఆప్ఘనిస్థాన్ వదిలి వెల్లిపోనున్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని రెడీ చేయడానికి తాలిబన్లు సిద్ధమవుతున్నారు.

ఆప్ఘనిస్థాన్ కొత్త రూలర్ వచ్చేస్తున్నాడు తాలిబన్ లీడర్ అతనే!

నిజానికి తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ పైన ఆధిపత్యం చెలాయించినప్పటికీ ఆ సంస్థ అధినేత ఇంత వరకూ ఎవరనేది తెలియలేదు.

2016వ సంవత్సరంలో తాలిబన్ల నాయకుడు ముల్లా ఒమర్ చనిపోవడంతో కొన్ని గ్రూపులుగా చీలిపోయారు.

ఆ తర్వాత అఖుంద్జాదానే తాలిబన్ల గ్రూపులను నడిపించాడు.అయితే ఆయన ఎక్కువగా ప్రజల్లోకి రాలేదు.

తాజాగా ఆగస్టులో 15వ తేదీ తాలిబన్లు దేశాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఆయన మాట బలంగా వినిపిస్తోంది.

ఆగస్టు 29వ తేదీన అఖుంద్జాదా ప్రజల ముందుకు వస్తారని తెలిపారు.అయితే ఆయన ప్రజల ముందుకు రాలేదు.

ఆగస్టు 31వ తేదీ నాటికి అమెరికన్ సేనలు ఆఫ్ఘనిస్థాన్ ను వదిలి వెళ్ళిపోతున్నాయి.

దీంతో సెప్టెంబర్ 1వ తేదీ నుండి తాలిబన్లు పూర్తిస్థాయిలో దేశాన్ని సొంతం చేసుకోనున్నారు.

తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోనున్నారు.ప్రస్తుతం కాందహార్ లో ఉన్న అఖుంద్జాదా అక్కడి నుండే తమ ప్రభుత్వ సందేశాన్ని వినిపించనున్నట్లు తెలుస్తోంది.

"""/"/ ఇంకోవైపు చూస్తే తాలిబన్ల డిప్యూటీ ఆఫీసియల్ స్పోక్స్ పర్సన్ బిలాల్ కర్రీ మీ కూడా అఖుంద్జాదా ప్రజల ముందుకు వస్తాడని ప్రకటన చేయడం గమనార్హం.

మొత్తానికి తాలిబన్లు తమ పంతం నెగ్గించుకుని దేశాన్ని హస్తగతం చేసుకున్నారు.ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమ సత్తాను ప్రపంచ దేశాలకు చాటనున్నారు.

తాలిబన్ల నాయకుడు, లీడర్ అఖుంద్జాదా తెరపైకి వస్తే ఇక మరో రకంగా పాలన సాగనుంది.

కఠిన ఆంక్షల మధ్య దేశం నడవనుందని ఇప్పటికే ప్రజలు భయాదోళన చెందుతున్నారు.ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆప్ఘన్ వైపే చూస్తున్నాయి.

తొలిరోజే అన్ని వేలమంది జూనియర్ ఆర్టిస్టులు.. ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో ప్లాన్ చేశారా?