అఫ్గాన్ బౌలర్ సరికొత్త రికార్డు.. తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడుగా!
TeluguStop.com
అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్ లెగ్-స్పిన్నర్ రషీద్ ఖాన్ తాజాగా టీ20 వరల్డ్ కప్ లో అరుదైన రికార్డును నెలకొల్పాడు.
ఆదివారం రోజు అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో భాగంగా రషీద్ ఖాన్ మార్టిన్ గుప్తిల్ వికెట్ పడగొట్టాడు.దాంతో టీ20 మ్యాచ్‌ల్లో 400 వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.
ఈ మ్యాచ్ తో రషీద్ ఖాన్ మొత్తంగా 289 టీ-20 మ్యాచ్‌లు ఆడారు.
కాగా అతడు 289 మ్యాచ్‌ల్లో అద్భుతమైన టాలెంట్ తో 400 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.
23 ఏళ్ల వయసులోనే ఈ మైలురాయిని చేరుకోవడం నిజంగా విశేషమే.2018లో 96 వికెట్లు తీసి ఒక ఏడాదిలో అత్యధిక టీ20 వికెట్లు తీసిన ఆటగాడిగా కూడా రషీద్ రికార్డు సృష్టించాడు.
అంతేకాదు అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
రషీద్ తన 53వ మ్యాచ్‌లోనే 100వ వికెట్‌ను పడగొట్టడం ఒక అద్భుతం అనే చెప్పాలి.
శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగ తన 76వ గేమ్‌లో 100వ మైలురాయిని చేరుకున్నాడు.
ఇప్పుడా రికార్డును రషీద్ ఖాన్ చెరిపేశారు. """/"/
ప్రతి మ్యాచ్ కు సగటున దాదాపు రెండు వికెట్లను తీయడమంటే మామూలు విషయమా! ఈ ఘనతను ప్రస్తుతం అఫ్గాన్ క్రికెట్ అభిమానులతో పాటు అందరూ ప్రశంసిస్తున్నారు.
రషీద్ ఖాన్ తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు అంటూ స్వదేశీ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
"""/"/
ఇదిలా ఉండగా టీ20 క్రికెట్‌లో మరో ముగ్గురు బౌలర్లు మాత్రమే 400 వికెట్ల మార్క్‌ను దాటారు.
364 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా డ్వేన్ బ్రావో నిలిచాడు.
అతడు టీ20ల్లో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా కూడా రికార్డు సృష్టించాడు.
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ మొత్తం మీద 512 మ్యాచ్‌లు ఆడి 553 వికెట్లు సాధించాడు.
320 మ్యాచ్‌ల్లో ఇమ్రాన్ తాహిర్, 362 మ్యాచ్‌ల్లో సునీల్ నరైన్ అనే మరో ఇద్దరు బౌలర్లు కూడా 400 వికెట్లు తీసిన బౌలర్లుగా చరిత్ర లిఖించుకున్నారు.
వీళ్ళిద్దరూ ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం.
టీ, కాఫీలకు బదులు డైలీ మార్నింగ్ ఈ డ్రింక్ ను తాగితే వెయిట్ లాస్ గ్యారెంటీ!