ఎగిరే విమానంలో చెలరేగిన మంటలు… చివరకు?

మనలో చాలామందికి విమానంలో ప్రయాణం అనేది ఒక కల.జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణం చేయాలని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు.

అయితే ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా అనిపించే విమాన ప్రయాణం కొన్ని సందర్భాల్లో భయభ్రాంతులకు కూడా గురి చేస్తూ ఉంటుంది.

తాజాగా అమెరికాలోని హోనోలోలు ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన ఆ ఫ్లైట్ లో ప్రయాణించే ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసింది.

మిలటరీ ఛార్డర్ ఫ్లైట్ ఆకాశంలో ఎగిరే సమయంలో ఫ్లైట్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి.

ఎగిరే విమానం రెక్కపై మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.విమానం ఎగిరే సమయంలో గాలి కూడా ఎక్కువగా వీయడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు తమ ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్టేనని భావించారు.అయితే ప్రయాణికుల అదృష్టం బాగుందేమో కానీ ఒక్క ప్రయాణికునికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండానే విమానం సురక్షితంగా నేలపై ల్యాండ్ అయింది.

దీంతో ఊపిరి పీల్చుకుంటూ ప్రయాణికులు నెమ్మదిగా నేలపై దిగారు.విమానానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా ఆ వీడియోలు, ఫోటోలు చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.

విమానంపై మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు తమ అనుభవాలను మీడియాతో పంచుకుంటూ తాము తీవ్ర భయాందోళనకు గురయ్యామని గతంలో ఎన్నోసార్లు విమాన ప్రయాణం చేసినా ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదని చెబుతున్నారు.

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ