రాజస్థాన్ కాంగ్రెస్ నేతలకు అడ్వైజరీ జారీ

రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం అనంతరం పార్టీ అధిష్టానం కీలక చర్యలకు రంగం సిద్ధం చేసింది.

ఈ క్రమంలో రాజస్థాన్ కాంగ్రెస్ నేతలకు కేసి వేణుగోపాల్ అడ్వైజరీ జారీ చేశారు.

పార్టీ అంతర్గత అంశాలు, ఇతర నేతలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పార్టీ అంతర్గత విషయాలు, ఇతర నేతలకు వ్యతిరేకంగా ఏ స్థాయి నేతలైన బహిరంగ ప్రకటనలు మానుకోవాలని సూచించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకొంటాం అని స్పష్టం చేశారు.

Dark Circles : నిత్యం ఈ సింపుల్ చిట్కాను పాటించారంటే వారం రోజుల్లో డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి!