టమాటా విత్తనాలు తింటున్నారా..అయితే ఇవి తెలుసుకోండి?
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా విరి విరిగా ఉపయోగించే కూరగాయల్లో టమాటాలు ముందుంటాయి.ముఖ్యంగా భారతీయ వంటల్లో టమాటా ప్రధాన కూరగాయగా మారిపోయింది అనడంలో సందేహమే లేదు.
వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా టమాటా పడితే టేస్ట్ అదిరిపోతుందంతే.అందుకే వేపుళ్లు మినహా దాదాపు ప్రతి వంటలోనూ టమాటాను వాడుతుంటారు.
అంతలా టమాటా మన వంటల్లో భాగమైంది.అయితే టమాటా తీసుకునేటప్పుడు లోపల ఉండే విత్తనాలు కొందరు తింటారు.
కొందరు తీసి పడేస్తుంటారు.అయితే టమాటా విత్తనాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదా.
వాటి వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, దుష్ప్రభావాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.టమాటా విత్తనాలు తీసుకోవడం వల్ల గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.
అలాగే చాలా మంది రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు మందులు వాడతారు.అయితే అలాంటి వారు టమాటా విత్తనాలు తీసుకోవడం మంచిది.
ఎందు కంటే.రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడంలో టమాటా విత్తనాలు ఉపయోగపడతాయి.
"""/" /
టమాటా విత్తనాలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా మెరుగు పడుతుంది.
దాంతో జీర్ణ సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.ఇక టమాటా విత్తనాలు ఆరోగ్యానికి మంచివే.
అయినప్పటికీ అతిగా తీసుకుంటే మాత్రం పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా టమాటా విత్తనాలను పరిమితికి మించి తీసుకోవడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే రిస్క్ పెరుగుతుంది.
"""/" /
ఒకవేళ కిడ్నీ స్టోన్స్ సమస్యను ఎదుర్కొంటున్న వారు టమాటా విత్తనాలను తీసుకుంటే సమస్య మరింత ఎక్కువవుతుంది.
అలాగే టమాటా విత్తనాలను ఓవర్‌గా తీసుకోవడం వల్ల పెద్ద పేగు వాపు మరియు ఇతర సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
అందుకే, టమాటా విత్తనాలను అతిగా కాకుండా.లిమిట్‌గా తీసుకోవాలి.
పుష్ప 2 మూవీ ఈ ఇయర్ ను గ్రాండ్ గా ఎండ్ చేస్తుందా..?