భారీ ఓపెనింగ్స్ పై కన్నేసిన 'లవ్ స్టోరీ'..అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్!

అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఇంకా విడుదలకు నోచుకోలేదు.అయితే ఇటీవలే ఈ సినిమాను సెప్టెంబర్ 24 న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకతింహ్చింది.

ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.

"""/"/ ఇప్పటికే విడుదలైన అన్ని పోస్టర్స్, టీజర్, పాటలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

ఇక ఈ మధ్యనే రిలీజ్ అయినా ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది.

ఈ ట్రైలర్ లో శేఖర్ కమ్ముల మార్క్ కనిపించింది.ఇక ఈ సినిమా పక్కా హిట్ అని అందరు అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి పెయిర్ ను తెర మీద చూడడం కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ కు వారం రోజులే ఉండడంతో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.

కరోనా తర్వాత ఏ సినిమాకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు.అయితే లవ్ స్టోరీ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు మాత్రం ముందుగానే టికెట్స్ బుకింగ్ అవుతున్నాయట.

హైదరాబాద్ లో ఉన్న థియేటర్స్ లో ఫస్ట్ డే 245 షోలలో 85 షోలు హౌస్ ఫుల్ అయిపోయాయి.

"""/"/ ఇక మహేష్ ఏఎంబి సినిమాస్ లో కూడా ఇప్పటికే 6000 టికెట్స్ అమ్ముడయ్యాయని టాక్.

ఇప్పటికే దాదాపు 35 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్స్ ఫుల్ అయ్యాయి.చాలా రోజుల తర్వాత థియేటర్ లు కళకళ లాడబోతున్నాయి.

ఇక అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం వల్ల ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగనుంది.

కష్టపడి అలసిపోయిన సురేఖ.. దుబాయ్ ట్రిప్ తీసుకెళ్లిన మెగాస్టార్?