ఓరినాయనో, ఒక్క సంవత్సరంలోనే రూ.367 కోట్లు సంపాదించిన అడల్ట్ స్టార్.. ఈమె స్టోరీ వింటే..?
TeluguStop.com
ఇంగ్లాండ్‌కు( England ) చెందిన ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఓన్లీఫాన్స్( OnlyFans ) బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
ఇక్కడ క్రియేటర్లు అడల్ట్ కంటెంట్‌ను ప్రదర్శిస్తూ అందుకు బదులుగా సబ్‌స్క్రైబర్ల నుంచి డబ్బులు అందుకుంటారు.
ఇప్పటికే ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా చాలా మంది క్రియేటర్లు భారీగా సంపాదించారు.అయితే అమెరికాకు చెందిన 20 ఏళ్ల మోడల్ సోఫీ రెయిన్( Sophie Rain ) ఎవరూ ఊహించనంత డబ్బులు సంపాదించి ఇటీవల వార్తల్లో నిలిచింది.
2023, నవంబర్ 28 నుంచి 2024 నవంబర్ 28 వరకు, ఆమె ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.
367 కోట్లు సంపాదించింది.తన ఎర్నింగ్స్ స్క్రీన్‌షాట్‌ను X (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ, "ఇక్కడ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది.
" అని రాసింది.సోఫీ రెయిన్ తన ముగ్గురు సోదరులతో కలిసి ఒక పేద కుటుంబంలో పెరిగింది.
ఆ కుటుంబం ప్రభుత్వం ఉచితంగా అందజేసే ఆహారం పైనే బతికేది.సోఫీ 17 ఏళ్ల వయసులో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వెయిట్రెస్‌గా పనిచేయడం మొదలుపెట్టింది.
2023 ఏప్రిల్‌లో, తన సోదరి సియెర్రా (ఆమెకు కూడా 20 ఏళ్ల వయసు) సహాయంతో ఓన్లీఫాన్స్ ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్‌ను సృష్టించడం మొదలుపెట్టింది.
ఆమె విజయం వల్ల ఆమె కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం లభించింది.సోఫీ తన ఆదాయంలో ఒక భాగాన్ని తన తండ్రి రూ.
12 లక్షల ఆస్తి పన్ను బకాయి చెల్లించడానికి ఉపయోగించింది. """/" /
"మా నాన్న రెస్టారెంట్‌ను నడుపుతున్నారు, ఆయన తన పన్నులు చెల్లించలేకపోతున్నారని నాతో చెప్పారు.
ఆ మొత్తం ఎంతో అడిగి, వెంటనే డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశాను" అని సోఫీ తెలిపింది.
"ఇప్పుడు నా తల్లిదండ్రులు నెలవారీ జీతం ఆధారంగా జీవించాల్సిన అవసరం లేదు" అని ఆమె తెలిపింది.
తనకు ఎంత డబ్బు వచ్చినా సోఫీ డబ్బు విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తుంది.
తన ఆదాయంలో 70% మొత్తాన్ని సేవ్ చేస్తోంది.ఆమెకు మూడు కార్లు ఉన్నాయి, బట్టలు కొనడం, బయట భోజనం చేయడం వంటి వాటిపై ఖర్చు చేయడం ఆమెకు ఇష్టం.
"""/" /
సోఫీ రైన్‌కు ఓన్లీఫాన్స్ ప్లాట్‌ఫామ్‌లో 11 మిలియన్‌కు పైగా సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 5.
2 మిలియన్ ఫాలోవర్లు, X (ట్విట్టర్)లో 2.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
ఆమె వైరల్ పోస్ట్‌ను 1.46 కోట్ల మందికి పైగా చూశారు.
ఆమె అద్భుతమైన జీవితాన్ని చూసి అభిమానులు అనేక కామెంట్లు చేస్తున్నారు."ఓన్లీఫాన్స్ రియల్ మాడ్రిడ్ కంటే ఎక్కువ చెల్లిస్తుంది!" అని ఒకరు వ్యంగ్యంగా అన్నారు.
మరొకరు, "చిన్న వయసులోనే రిచ్‌గా మారి రిటైర్ అయిపో అని అంటారు కదా, ఆ మాటలను ఈమె నిజం చేసింది.
న్యూయార్క్‌లోని వికాస్ ఖన్నా రెస్టారెంట్‌కు వీర్ దాస్ .. గర్వపడుతున్నానంటూ పోస్ట్