డెన్ నుంచి బయటకొచ్చి ఆడుకున్న సింహం పిల్లలు.. క్యూట్ వీడియో డోంట్ మిస్!
TeluguStop.com
సింహాలు( Lions ) చాలా ప్రమాదకరమైన జంతువులు కాబట్టి వాటిని దూరంగా ఉండాలి.
కానీ అవి చాలా క్రూర మృగాలుగా కనిపించినప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రేమను చూపిస్తుంటాయి అంటే వాటి ఫ్యామిలీ పైన అవి ప్రేమ ఆప్యాయత చూపిస్తూ తమకు కూడా మనసుంది అని నిరూపిస్తాయి.
తాజాగా దక్షిణాఫ్రికాలోని( South Africa ) మలమాల గేమ్ రిజర్వ్‌లో నాలుగు సింహాలు పిల్లలు ఇదే విషయాన్ని తెలియజేశాయి.
అవి తమ గుహ( Den ) వెలుపల ఆడుకుంటూ దానిపై ఒకటి ప్రేమ కురిపిస్తూ కెమెరాకి చిక్కాయి.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దాన్ని చూసి చాలా బ్యూటిఫుల్‌గా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
"""/" /
ఈ వీడియోను ఆ జంతు సంరక్షణ కేంద్రం తమ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో, రెండు చిన్న సింహాలు తమ గుహ వెలుపల ఒక రాతిపై కూర్చుని ఉన్నాయి.
కొద్ది సేపటికి, మరో రెండు చిన్న సింహాలు( Lion Cubs ) వాటితో చేరాయి.
వాటిలో ఒకటి బయట దృశ్యాన్ని ఆస్వాదిస్తుండగా, మిగతా మూడు ఒకదానితో ఒకటి ఆడుకుంటూ ఉన్నాయి.
"""/" /
ఈ ముచ్చటైన సింహం పిల్లల వీడియో చూసిన చాలా మంది ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఆ పోస్ట్ కింద హార్ట్ ఎమోజీలు కామెంట్ చేశారు.ఒకరు, "ఇంత క్యూట్‌గా ఉందంటే అదే ఎక్కువ" అని కామెంట్ చేశారు.
మరొకరు, "అది చాలా అందమైన వీడియో" అని అన్నారు.కొంతమంది ఆ రాతి మీద కూర్చున్న సింహాన్ని గమనించారు.
మరొకరు, "అన్ని సింహాలు ఒకేలా కనిపిస్తున్నాయి కానీ, ప్రతి ఒక్కటి తనకంటూ ప్రత్యేకమైన స్వభావం కలిగి ఉంటాయి" అని అన్నారు.
చిన్న సింహం పిల్లను తెచ్చుకొని పెంచుకోవాలని కోరిక తనకున్నట్లు మరి కొంతమంది పేర్కొన్నారు అయితే వాటి స్వభావం ఎల్లప్పుడూ క్రూరంగా ఉంటుంది కాబట్టి వాటిని దూరంగానే ఉంచాలని మరికొంతమంది హెచ్చరించారు.
నాటుకోడి గుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయా.. వాటికి ఎందుకంత క్రేజ్!