గ్రూప్ -2 పరీక్ష వాయిదాపై హైకోర్టు విచారణ వాయిదా

తెలంగాణలో గ్రూప్ -2 పరీక్ష వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో వాదనలు ముగిశాయి.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం టీఎస్పీఎస్సీకి కీలక ఆదేశాలు ఇచ్చింది.గ్రూప్-2 పరీక్షపై ఏ నిర్ణయం తీసుకుంటారో సోమవారం లోపు చెప్పాలని టీఎస్పీఎస్సీకి కోర్టు సూచించింది.

ఈ క్రమంలో హడావుడిగా ఒకే నెలలో పరీక్షలు నిర్వహిస్తున్నారని అభ్యర్థుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అయితే గ్రూప్-2 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ఆరు నెలల ముందే వచ్చిందన్న టీఎస్పీఎస్సీ తరపు న్యాయవాది కావాలనే పరీక్షను వాయిదా వేయించే ప్రయత్నం జరుగుతుందని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్పీ తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటించాలన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

స్కిల్ ఉంటేనే ఎంట్రీ, కఠిన నిబంధనలు… విదేశీ విద్యార్ధులపై ఆస్ట్రేలియా కొత్త పాలసీ