పవన్ అంటే గౌరవం.. అకీరా అంటే ప్రాణం.. అడివి శేష్ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైనటువంటి కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు అడివి శేష్ ( Ai Sesh ) ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఈయన త్వరలోనే గూడచారి సీక్వెల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇలా నటుడిగా విభిన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి శేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు వీర అభిమాని అనే సంగతి మనకు తెలిసిందే.

ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా ( Akira )తో ఈయనకు ఎంతో మంచి అనుబంధం ఉంది.

వీరిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి పలు సందర్భాలలో వీరు బయట పడుతూ ఉంటారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/04/Aisesh-comments-viral-about-pawan-kalyan-and-akirab!--jpg" / ఇటీవల మంచు మనోజ్( Manchu Manoj ) కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అడివి శేష్ అకీరాతో ఏర్పడిన పరిచయం గురించి వెల్లడించారు.

ఒకసారి తాను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడివి శేష్ ని అకిరా కలుసుకున్నాడట.

కాగా అప్పుడు అకిరా, అడివి శేష్‌తో.నాకు మీ సినిమాలంటే ఇష్టం అని చెబితే, అడివి శేష్, అకిరాతో.

నాకు మీ నాన్న సినిమాలు అంటే చాలా ఇష్టమని చెప్పారట.అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఫోన్ నెంబర్లు మార్చుకోవటం జరిగింది.

ఆ సమయంలో ఈయన గూడచారి సినిమాలో చేస్తున్నారు ఆ సినిమాలోని మ్యూజిక్ కంపోస్ట్ చేసి అకీరా తనకు పంపించారు.

ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/04/Aisesh-comments-viral-about-pawan-kalyan-and-akirac!--jpg" / ఈ క్రమంలోనే మనోజ్ అడివి శేష్ ను ప్రశ్నిస్తూ నీకు కనుక అకిరాతో అలాగే పవన్ కళ్యాణ్ తో ఒకేసారి డైరెక్షన్ చేసే అవకాశం వస్తే ఎవరికి ఎస్ చెబుతావు ఎవరికి నో చెబుతావు అనే ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు అడివి శేష్ సమాధానం చెబుతూ నాకు పవన్ కళ్యాణ్ అంటే గౌరవం.

కానీ అకిరా అంటే ప్రాణం.కాబట్టి అకీరాతోనే సినిమా చేస్తాను.

పవన్ కి నో చెబుతాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా అంటే తనకు ఎంత ప్రేమ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్11, బుధవారం 2024