గత పదేళ్లలో పవన్ కళ్యాణ్ గారితో రెండు మూడు సార్లు మాత్రమే మాట్లాడాను!
TeluguStop.com
టాలీవుడ్ హీరో డివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మేజర్.
ఈ సినిమా 2008, నవంబర్ 28 న జరిగిన దాడుల్లో వీర మరణం పొందిన ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆదారంగా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు దర్శకుడు శిఖరం తిక్క దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా జూన్ 3 విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా హీరో అడివి శేష్ ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఈ సినిమా ఇప్పటికే కొన్ని నగరాల్లో స్పెషల్ స్క్రీనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ముంబై, పుణె వంటి సిటీల్లో మేజర్‌ను ప్రదర్శించారు.ఇక నిన్న వైజాగ్‌లో స్పెషల్ షో వేశారు.
అనంతరం అడివి శేష్ అక్కడి మీడియాతో ముచ్చటించగా ఈ సందర్బంగా మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చాడు.
ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ కోసం ఏమైనా స్పెషల్‌గా షోను వేస్తున్నారా? అని అడివి శేష్‌ని ప్రశ్నించగా.
ఆయన్ను అయితే సంప్రదించాం.స్పెషల్ షో వేస్తామని అన్నాం.
కానీ ఆయన ఇప్పుడు పొలిటికల్‌గా బిజీగా ఉన్నారు.పవన్ కళ్యాణ్ ఎప్పుడు వేయమంటే అప్పుడు షో వేయడానికి సిద్ధంగా ఉన్నాము అని అడివి శేష్ తెలిపారు.
"""/"/
ఆయనకు మాత్రం షోను వేసి చూపించాలని అనుకుంటున్నామని అడివి శేష్ చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా తనకు పవన్ కళ్యాణ్ అంటే , పవన్ ని తాను ఆరాధిస్తుంటానని తెలిపాడు.
అలాగే పవన్ తనయుడు అయిన అకీరా నందన్ తనకు మంచి స్నేహితుడని, గత పదేళ్లలో పవన్ కళ్యాణ్ గారితో రెండు మూడు సార్లు మాత్రమే మాట్లాడి ఉంటాను అని చెప్పుకొచ్చారు అడివి శేష్.
మొత్తానికి హీరో అడివి శేష్ పవన్ కళ్యాణ్ తో అంతగా టచ్ లో లేకపోయిన పవన్ కొడుకు అకీరాతో మాత్రం అడివి శేష్ ఫుల్ క్లోజ్‌గా ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరూ కలిసి బాస్కెట్ బాల్ ఆడటమే కాకుండా, అకిరా అడివి శేష్ కోసం స్పెషల్ గిఫ్ట్‌లు కూడా పంపిస్తుంటాడట.
రేణూ దేశాయ్ ఈ విషయాలన్నీ కూడా ఆ మధ్య ఒకసారి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా స్పూఫ్ లతో సుడిగాడు సీక్వెల్.. నరేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?