హిట్ 2 ఈ డిమాండ్ ఊహించిందే..!
TeluguStop.com
విశ్వక్ సేన్ హీరోగా నాని నిర్మాణంలో తెరకెక్కిన హిట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది.
ఇక ఇప్పుడు ఆ మూవీకి సీక్వల్ గా హిట్ 2 వస్తుంది.ఈ మూవీ లో అడివి శేష్ హీరోగా నటించారు.
హిట్ 2 సినిమా లో అడివి శేష్ ప్లస్ అని చెప్పొచ్చు.ఇప్పటికే అతను నటించిన మేజర్ నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.
అందుకే ఇప్పుడు హిట్ 2 సినిమాని కూడా నేషనల్ వైడ్ గా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హిట్ 2 ని డైరెక్టర్ శైలేష్ మరింత థ్రిల్లర్ గా తెరకెక్కించాడు.తప్పకుండా ఈ మూవీ అడివి శేష్ కి మరో సూపర్ హిట్ అందించేలా ఉంది.
హిట్ 2 మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.మర్డర్ మిస్టరీతో సాగే ఈ మూవీ ఆధ్యంతం ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ సస్పెన్స్ గా ఉంటుందని అంటున్నారు.
హిట్ 2 సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉండగా మేజర్ హిట్ అవడంతో ఈ మూవీని పాన్ ఇండియా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కానీ హిట్ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అయితే బెటర్ అని అక్కడ రిలీజ్ విరమించుకున్నారు.