పవన్, అకిరాల గురించి అడివి శేష్ ఇలా అన్నాడేంటి..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ త్వరలో హిట్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

నాని నిర్మిస్తున్న ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేశారు.ఆల్రెడీ విశ్వక్ సేన్ తో చేసిన హిట్ ది ఫస్ట్ కేస్ సూపర్ హిట్ కాగా ఇప్పుడు హిట్ 2 అంతకుమించి అనిపించేలా చేస్తున్నారు.

ఇక ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అడివి శేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అకిరా నందన్ ల గురించి చెప్పుకొచ్చాడు.

హిట్ 2 పోస్టర్స్ లో అడివి శేష్ టీ గాజు గ్లాస్ పట్టుకుని ఉంటాడు.

దానికి ఒక రిపోర్టర్ ఎందుకు పవన్ కళ్యాణ్ జనసేన గుర్తుని వాడారు అన్నాడు అయితే అడివి శేష్ దానికి సమాధానంగా ఆ గ్లాస్ క్యాజువల్ గా పెట్టిందే దానికి పార్టీకి సంబంధం లేదని అన్నాడు.

ఇక ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్, అకిరా తన హృదయాల్లో ఉంటారని అన్నారు అడివి శేష్.

వారికి తన లైఫ్ లో ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు అడివి శేష్.

మొత్తానికి మరొసారి పవన్ తో పాటుగా అతని అకిరాతో కూడా తన బాండింగ్ గురించి చెప్పి సర్ ప్రైజ్ చేశాడు అడివి శేష్.

రీసెంట్ గా మేజర్ తో హిట్ కొట్టిన ఈ హీరో హిట్ 2 తో డబుల్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఆర్య తర్వాత దిల్ రాజు బ్యానర్ లో సుకుమార్ సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి..?