ఆదిత్య 369 మూవీకి మొదట అనుకున్న టైటిల్ ఇదే.. మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna ) సినీ కెరీర్ లోని ప్రత్యేకమైన సినిమాలలో ఆదిత్య 369( Aditya 369 ) సినిమా కూడా ఒకటి.

సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఈ సినిమా సక్సెస్ గురించి ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది.ఈ సినిమా విడుదలై 33 సంవత్సరాలు కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఒకరోజు సింగీతం శ్రీనివాసరావు టైమ్ మెషీన్ అనే నవలను చదివి ఆ నవల స్పూర్తితో సినిమా తీయాలని భావించి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు.

భూతకాలంలోకి వెళ్తే శ్రీ కృష్ణదేవరాయలు కాలం నాటికి వెళ్లాలని ఆయన అప్పటికే నిర్ణయం తీసుకున్నారు.

మద్రాస్ లోని అమెరికన్ లైబ్రరీకి వెళ్లి భవిష్యత్ లో నగరాలు భూమిలో నిర్మితమై ఉంటాయని కథను సిద్ధం చేసుకున్నారు.

"""/" / ఆ తర్వాత ఒక సందర్భంలో సింగీతం ఈ కథను ఎస్పీ బాలుకు చెప్పారు.

ఆ సమయంలో శ్రీ కృష్ణదేవరాయలు పాత్రకు బాలయ్య బాగుంటారని భావించారు.ఈ సినిమాలో హీరోయిన్ గా విజయశాంతి పేరును పరిశీలించారు.

ఆమెకు డేట్స్ సమస్య ఉండటంతో మోహినిని ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు.

ఈ సినిమాలో శాస్త్రవేత్త పాత్ర కోసం టీనూ ఆనంద్ ను తీసుకున్నారు. """/" / ఈ సినిమాలో బాల నటులుగా తరుణ్, రాశి నటించారు.

టైమ్ మెషీన్ సన్నివేశాలను మద్రాస్ లోని వాహినీ స్టూడియోస్ లో వేసి తెరకెక్కించారు.

ఈ సినిమాకు మొదట కాలయంత్రం అనే టైటిల్ ను పరిశీలించారు.వేర్వేరు టైటిల్స్ ను పరిశీలించి ఆదిత్య 369 టైటిల్ ఫిక్స్ చేశారు.

కోటీ 60 లక్షల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

అర్హతలు ఉన్నా సాయిపల్లవికి దక్కని అవార్డ్.. మరీ ఇంత అన్యాయమా అంటూ?