మా పెళ్లి జరిగేది అక్కడే.. పెళ్లిపై అప్డేట్ ఇచ్చిన సిద్ధార్థ్ ఆదితి!

హీరో సిద్దార్థ్( Siddharth ) హీరోయిన్ అదితిరావు హైదరి ( Aditirao Hydari ) అజయ్ భూపతి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహాసముద్రం సినిమా ద్వారా జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని తెలుస్తుంది.ఈ సినిమా తర్వాత ఎక్కడికి వెళ్లిన జంటగా కనిపించేవారు.

దీంతో వీరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

ఇక వీరి గురించి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ జంట కూడా తమ రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు.

"""/" / ఇకపోతే తమ రిలేషన్ బయట పెట్టడమే కాకుండా తెలంగాణలోని ఒక ఆలయంలో వీరిద్దరూ చాలా సింపుల్ గా నిశ్చితార్థం( Engagment ) చేసుకున్నారు.

వీరి నిశ్చితార్టానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.అయితే వీరికి పెళ్లి గురించి తాజాగా ఒక విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా నటి ఆదితి రావు సిద్దార్థ్ గురించి మాట్లాడుతూ తనకు సిద్దార్థ్ మహాసముద్రం సినిమా సమయంలోనే పరిచయమయ్యారని తెలిపారు.

"""/" / ఇక హైదరాబాద్లో తన నాన్నమ్మ ఉంటుంది తన నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం.

ఆమె హైదరాబాదులో స్కూల్ ( School ) పెట్టింది.నేను చిన్నప్పుడు ఎక్కువగా అదే స్కూల్లోనే సమయం గడిపే దాన్ని నాకు ఆ స్కూల్ అంటే చాలా ఇష్టం.

ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్ ఒకరోజు తనని ఆ స్కూల్ కి తీసుకు వెళ్ళమని చెప్పాడు.

దాంతో ఒకరోజు ఇద్దరం కలిసి అక్కడికి వెళ్లాం.అయితే ఆ స్కూల్లోనే సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశారని ఆదితి వెల్లడించారు.

ఇక ఆయన అక్కడ ప్రపోజ్ చేయడానికి కారణం తన నాన్నమ్మ ఆశీస్సులు మాపై ఉండాలనే ప్రపోజ్ చేశానని చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది.

ఇక మా పెళ్లి వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ( Ranganath Swamy Temple ) మా ఫ్యామిలీకి చాలా స్పెషల్.

మా ఎంగేజ్మెంట్ అక్కడే జరిగింది.పెళ్లి కూడా అక్కడే జరుగుతుంది.

పెళ్లి డేట్ ఫిక్స్‌ అయ్యాక మేమే అందరికి చెప్తాము అంటూ ఈమె పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .

కెమెరాలో చిక్కిన సీక్రెట్ మూమెంట్.. మెలానియా ట్రంప్‌కు గవర్నర్ ముద్దు.. వీడియో వైరల్..