Siddharth : అమీర్ కూతురి రిసెప్షన్ లో జంటగా సందడి చేసిన సిద్ధార్థ్ ,అదితి రావు హైదరి!
TeluguStop.com
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ( Amir Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అయితే ఇటీవల అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్( Ira Khan) వివాహం ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.
ఈమె ఫిట్నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేని జనవరి 3న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ జంట జనవరి మూడున రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు ఈ రిజిస్టర్ మ్యారేజ్ సమయంలో నూపుర్ జాగింగ్ డ్రెస్ లో సుమారు 8 కిలోమీటర్లు దూరం జాయిన్ చేస్తూ వచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
"""/" /
ఇలా రిజిస్టర్ మ్యారేజ్ పూర్తి అయిన అనంతరం ఈ జంట సాంప్రదాయపద్ధంగా రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
ఇలా వివాహం చేసుకున్నటువంటి ఈ జంట రెండుసార్లు రిసెప్షన్ జరుపుకున్నారు.ఇటీవల ముంబైలో సినీ సెలబ్రిటీల కోసం నటుడు అమీర్ ఖాన్ ఘనంగా రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా సందడి చేశారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"""/" /
ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్స్ అందరూ కూడా ఈ రిసెప్షన్ వేడుకల్లో సందడి చేశారు.
అదే విధంగా ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముఖేష్ అంబానీ దంపతులకు కూడా ఈ రిసెప్షన్ వేడుకకు హాజరై సందడి చేశారు .
బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేయడమే కాకుండా ఈ వేడుకలలో నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితి రావు హైదరి(Aditi Rao Hydari) జంటగా కనిపించే సందడి చేశారు.
దీంతో ఈ ఫోటోలు వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. """/" /
వీరిద్దరూ ఈ రిసెప్షన్ వేడుకకు బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు.
ఇక వీరిద్దరూ జంటగా రావడంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి వీరిద్దరు గత కొంతకాలంగా కలిసే ఉంటున్నప్పటికీ తమ రిలేషన్ గురించి మాత్రం ఎక్కడా బయటపడటం లేదు కానీ ఎక్కడికి వెళ్ళినా వీరిద్దరూ కలిసే వెళ్లడం గమనార్హం.
ఇక ఈ పెళ్లి వేడుకలలో కూడా వీరిద్దరు జంటగా కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే ఆ రిలేషన్ అధికారికంగా ప్రకటించబోతున్నారంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.
వైరల్: స్తన్యం పట్టుకొని మరీ వీధి కుక్కపాలు తాగిన యువతి.. కారణం ఇదే!