రష్మీ పారితోషికం పై ఆది ఓపెన్ కామెంట్స్... ఏమన్నారంటే?
TeluguStop.com
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఇన్ని రోజులు పాటు హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కావడంతో ఇతర కమెడియన్లు వచ్చామా స్కిట్ చేశామా.
వెళ్ళామా అనే విధంగానే ఉంది.ఎప్పుడైతే ఈ కార్యక్రమానికి హైపర్ ఆది తిరిగి వచ్చారో ఈ కార్యక్రమం తిరిగి ఎంతో ఉత్సాహంగా కొనసాగుతోంది.
ఇక హైపర్ ఆది కమెడియన్ల అందరితో కలిసి వేసే పంచ డైలాగ్ లు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇకపోతే వచ్చే వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది రష్మి రెమ్యూనరేషన్ పై తనదైన శైలిలో కామెంట్ చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా బులెట్ భాస్కర్, ఇమ్మాన్యూల్, రాకింగ్ రాజేష్ ఒక గ్యాంగ్ గా మారి క్రికెట్ బ్యాట్స్ తో ఎంట్రీ ఇచ్చారు.
ఇలా వచ్చి రాగానే మా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ఇద్దరు అబ్బాయిలను ఇక్కడ అమ్మాయిలు వలలో వేసుకున్నారట మా అబ్బాయిలను వదిలేయండి లేకుంటే రక్తపాతాలే అంటూ ఇమ్మాన్యుయేల్ కి వార్నింగ్ ఇచ్చారు.
ఇక హైపర్ ఆది, రాకెట్ రాఘవ తన గ్యాంగ్ తో వచ్చి బుల్లెట్ భాస్కర్ టీం పై తనదైన శైలిలో పంచులు వేస్తూ అవమానపరిచారు.
"""/"/
ఇలా అవమానం జరిగిన వెంటనే బుల్లెట్ భాస్కర్ స్పందిస్తూ.ఇంత అవమానం జరిగాక ఇంకా ఇక్కడేందుకు వెళ్దాం పద రష్మీ నీకు కావాల్సిన పేమెంట్ నేనిస్తాను అంటూ కామెంట్ చేశారు.
ఇలా బుల్లెట్ భాస్కర్ రష్మీ కి పేమెంట్ ఇస్తారని చెప్పడంతో వెంటనే హైపర్ ఆది స్పందిస్తూ రష్మి కు నువ్వు పేమెంట్ ఇవ్వాలంటే 100 పెద్దమనిషి ఫంక్షన్స్ చేసినా సరిపోదు అంటూ కామెంట్స్ చేశాడు.
దీనితో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు.మొత్తానికి రష్మీ రెమ్యూనరేషన్ గురించి కమెడియన్స్ చేసినటువంటి స్కిట్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
బన్నీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయా.. న్యాయ నిపుణులు చెప్పిన విషయాలివే!