Adipurush : పాపం డైరెక్టర్ ఓం రౌత్ ని ఆటాడుకుంటున్న నెటిజన్స్.. ఓల్డ్ ట్వీట్ వైరల్ చేస్తూ?

ఆదిపురుష్( Adipurush ).దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు.

గత కొద్ది రోజులుగా ఈ సినిమా పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించగా, సీత పాత్రలో బాలీవుడ్ నటి కృతి సనన్ నటించింది.

ఓం రౌత్( Om Raut ) దర్శకత్వం వహించిన సినిమా జూన్ 16న విడుదల అయ్యి విడుదలైన మొదటి రోజే దాదాపు రూ.

140 కోట్ల కలెక్షన్స్ ను సాధించి సంచలనం సృష్టించడంతో పాటు రికార్డులను బద్దలు కొట్టింది.

"""/" / అయితే ఈ సినిమా విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికి కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది.

సినిమాలో నటీనటుల నటనపై కురిపిస్తున్నారు అభిమానులు ప్రముఖులు.కానీ సినిమాను తెరకెక్కించే విధానంపై అలాగే సినిమాలోని కొన్ని సన్నివేశాలపై దర్శకుడు ఓం రౌత్ ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్స్.

థియేటర్‌లో హనుమంతుడికి సీట్ కేటాయించిన సినిమా బృందం.సినిమాను మాత్రం సరిగా చిత్రీకరించలేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

రావణాసురుడు, ఆంజనేయుడు, వానరసేనను చిత్రీకరించిన విధానంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. """/" / ఈ సినిమాలో భారతీయత లోపించిందని, అసలు దర్శకుడు ఓంరౌత్ రామాయణాన్ని అధ్యయనం చేశాడా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే గతంలో హనుమంతుడి పై ఓంరౌత్ చేసిన కామెంట్ ఇప్పుడు మరో వివాదాన్ని క్రియేట్ చేస్తోంది.

హనుమంతుడికి చెవులు వినిపించవా? అంటూ ఓంరౌత్ గతంలో ఒక ట్వీట్ చేశాడు.ఆ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఆదిపురుష్‌లో హనుమంతుడిని, వానరసేను తప్పుగా చూపించాడని విమర్శిస్తూ.గతంలో ఆయన చేసిన ట్వీట్ తాలూకు స్క్రీన్ షాట్‌ను రీపోస్ట్ చేస్తున్నారు నెటిజన్స్.

ఆ ట్వీట్ లో హనుమంతుడు ఏమైనా చెవిటివాడా? నేను నివాసం ఉంటున్న భవనంలోని ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారు.

హనుమాన్ జయంతి రోజున వీధుల్లో పెద్ద పెద్ద శబ్ధాలతో పాటలు పెడుతున్నారు.పైగా ఇవన్నీ అసంబద్ధమైన పాటలే అంటూ ఓంరౌత్ ట్వీట్ చేశాడు.

ఆ ట్వీట్ పై స్పందించిన నెటిజన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ బూతులు తిడుతూ డైరెక్టర్ పై ఒక రేంజ్ లో విడుచుకుపడుతున్నారు.

వింటర్ లో చర్మాన్ని తేమగా ఉంచడానికి తోడ్పడే బెస్ట్ హోమ్ మేడ్ లోషన్ ఇదే!