ఆదిపురుష్ టికెట్ రేట్ తగ్గించిన టీ సీరీస్…

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ప్రభాస్ ఆదిపురుష్( Prabhas , Adipurush ) సినిమా మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది అందులో భాగం గా సినిమాకు ప్రతికూల రివ్యూలు వచ్చాయి ఇక అయినప్పటికీ ఈ సినిమా విడుదలైన మొదటి మూడు రోజుల్లో సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.

పర్వాలేదు అన్నట్టు సోమవారం భారీ వసూళ్లు వచ్చాయి.అయితే మంగళవారం నుంచి ఈ సినిమా వసూళ్లు భారీగా పడిపోయాయని బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి.

ఒకవైపు ఆదిపురుష్ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పడుతుండగా టీ-సిరీస్( T-Series ) 150 రూపాయలకే 3డి( 3D ) లో సినిమాను వీక్షించవచ్చని ప్రకటించింది.

"""/" / అయితే ఇది కర్ణాటక ( Karnataka )మినహా దక్షిణ భారతదేశంలో ఎక్కడా జరగడంలేదు.

టి-సిరీస్ ఆఫర్ కొన్ని రాష్ట్రాలకే పరిమితం కావడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజుల్లో ఇంత తక్కువ ధరలో 3D వెర్షన్‌ను చూడటం చాలా అరుదు.

ఆదిపురుష్ ను త్రీడీలో చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.అయితే సౌత్‌లో ఈ అవకాశం దక్కలేని వారు అసంతృప్తి చెందారు.

దక్షిణాది ప్రేక్షకులు ఏం పాపం చేశారంటూ సోషల్ మీడియాలో టీ-సిరీస్ పై కామెంట్స్ చేశారు.

"""/" / తెలుగులో మంచి వసూళ్లు సాధించిన 3డి వెర్షన్ రూ.150 వసూలు చేస్తే ఇంకా బాగుంటుందని బాక్సాఫీస్ వర్గాలు కూడా అంటున్నాయి.

యూనిట్ సభ్యులు ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా రూ.100 కోట్లు కలెక్ట్ చేయాలనే టార్గెట్ ఉండగా ఇప్పుడు పరిస్థితులను బట్టి ఈ సినిమా కు కనీసం సగమైనా వసూళ్లు నమోదవుతుందా అని మరి కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఇది ప్రభాస్ కెరియర్ లోనే ఒక భారీ ప్లాప్ గా చాలా మంది సినీ మేధావులు సైతం చెప్తున్నారు.

దీనికంతటికీ కారణం ఆ సినిమా డైరెక్టర్ ఓం రావత్ అని తెలుస్తుంది.