ప్రభాస్ ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడా? సోషల్ మీడియాలో కొత్త గాసిప్?
TeluguStop.com
టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలోని కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం.
ప్రస్తుతం ప్రభాస్ సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె, ఆది పురుష్ సినిమాలతో బిజీగా ఉండగా ఇప్పటికే ఆది పురుష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
అలాగే మిగతా సినిమాలకు సంబంధించిన షూటింగ్ కూడా దాదాపు 50 శాతం పూర్తి అయింది అంట కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో చేస్తారు ప్రభాస్ ప్రేమలో పడ్డాడ అంటే సోషల్ మీడియాలో అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.అయితే అభిమానులు కూడా అదే వార్త నిజం అవుతే బాగుండు అని అనుకుంటున్నారు.
చూడడానికి కూడా ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉంటుందని, నిజంగానే ఈ వార్తలో నిజం ఉంది అని ప్రభాస్ అభిమానులు డిసైడ్ అవుతున్నారు.
ప్రభాస్,కృతి సనన్ కలిసి ఆది పురుష్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. """/"/
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో అభిమానులతో పాటు కృతి, ప్రభాస్ కూడా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాతో చాలాకాలం తర్వాత తెలుగులోకి కృతి సనన్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
అయితే వీరి మధ్య ప్రేమ ఉంది అంటూ గాసిపు వినిపించడానికి కారణాలు కూడా ఉన్నాయి.
ఇటీవల కృతి సనన్ కాఫీ విత్ కరణ్ అనే టాక్ షోలో పాల్గొంది.
ఈ క్రమంలోనే హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ హీరో ప్రభాస్‌కి కాల్ చేసింది.
అయితే కృతి సనన్ నుంచి ఫోన్ రాగానే తొలి రింగ్‌కే లిఫ్ట్ చేశాడు ప్రభాస్.
దీంతో వీరి మధ్య ఏదో నడుస్తోంది అన్న వార్తలు మొదలయ్యాయి.అదీ అసలు విషయం.
అంతే కాకుండా కృతి సనన్ కూడా తన స్నేహితుల లిస్టులో ప్రభాస్ ని వెరీ వెరీ స్పెషల్‌గా కృతి సనన్ పేర్కొనడం గమనార్హం.
విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ హిట్ మూవీకి సీక్వెల్ రానుందా?