ఆదిపురుష్‌ కోసం ఎదురు చూపులు.. ఓటీటీ విషయంలో మాట మార్చుతారా?

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా విడుదల అయ్యి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుంది.

వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుంది అనుకుంటే తీవ్రంగా నిరాశ పర్చింది.అంతే కాకుండా తీవ్రమైన వివాదాలను మూట కట్టుకున్న విషయం కూడా తెల్సిందే.

దాంతో ఆదిపురుష్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ఇక ఆదిపురుష్ సినిమా( Adipurush ) ను చూడాలి అనుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు.

కానీ సినిమా ఫెయిల్‌ టాక్ వచ్చినప్పుడు వెళ్లి థియేటర్‌ లో చూడాల్సిన అవసరం ఏంటి.

త్వరలో ఓటీటీ లో వస్తుంది కదా అప్పుడు చూద్దాం అన్నట్లుగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు.

"""/"/ ఓటీటీ స్ట్రీమింగ్‌( Adipurush OTT Release Date ) కోసం ప్రభాస్ అభిమానులు కూడా వెయిట్‌ చేస్తున్నారు.

థియేటర్ లో చూసిన వారి కంటే కనీసం మూడు రెట్లు అధికంగా ఓటీటీ లో చూస్తారు అంటూ అంతా చర్చించుకుంటున్నారు.

కానీ మేకర్స్ సినిమా విడుదలకు ముందే ఓటీటీ లో ఈ సినిమా ను థియేట్రికల్‌ రిలీజ్ అయిన యాబై రోజుల తర్వాత మాత్రమే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

దాంతో అప్పటి వరకు అభిమానులు మరియు ప్రేక్షకులు వెయిట్‌ చేయాల్సిందే.అయితే ఓటీటీ లో స్ట్రీమింగ్‌ విషయమై నిర్మాతల నిర్ణయంలో ఏమైనా మార్పు వచ్చి ఉంటుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

"""/"/ ఎందుకంటే సినిమా థియేట్రికల్‌ రిలీజ్ అయ్యి నిరాశ పర్చింది.కనుక ఓటీటీ లో ముందు గా విడుదల చేస్తే కనీసం ఆ నష్టం ను భర్తీ కొంత అయినా చేయవచ్చు.

అందుకే మేకర్స్ మాట తప్పి వెంటనే సినిమా ను ఓటీటీ లో విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆదిపురుష్ సినిమా ను ఏ ఓటీటీ కొనుగోలు చేసింది అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

వావ్, అచ్చం మనుషుల్లాగానే మాట్లాడుతున్న కుక్కలు.. ఈ వీడియో చూస్తే..