Lavi Pajni : ఆదిపురుష్ లో డైలాగ్స్ నాకే నచ్చలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన లావ్ పజ్నీ?
TeluguStop.com
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్( Om Raut) దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్( Adipurush).
ఇటివలే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది.
అంతేకాకుండా భారీగా విమర్శలు నెగిటివ్ కామెంట్స్ కాంట్రవర్సీలను ఎదుర్కొంది.ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ పై భారీగా ట్రోలింగ్స్ జరిగాయి.
మొదటి నాలుగు రోజులు ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు థియేటర్ లకు క్యూ కట్టారు.
"""/" /
కానీ ఆ తర్వాత నెమ్మదిగా థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లడమే మానేశారు.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై మరీ ముఖ్యంగా హనుమంతుడి నోట వచ్చే మాస్ డైలాగులపై తీవ్ర వ్యతిరేక వ్యక్తం అయిన విషయం తెలిసిందే.
అయితే ఈ డైలాగులు జనాలకు కనెక్ట్ అవుతాయని చిత్రం బృందం భావించారు.కానీ ఊహించని విధంగా అంచనాలు రివర్స్ అయ్యాయి.
దాంతో చిత్రయూనిట్ వెంటనే తప్పును సరిదిద్దుకుంది.కానీ అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది.
ఆ డైలాగులు కూడా సినిమాపై నెగెటివిటీ పెరిగేందుకు దోహదపడ్డాయి.ఇది ఇలా ఉంటే సినిమాలోని డైలాగులు తనకు కూడా నచ్చలేదు అంటున్నాడు ఆదిపురుష్ నటుడు లావ్ పజ్నీ.
"""/" /
ఇతను సినిమాలో కుంభకర్ణుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న లావ్ లావ్ పజ్నీ( Lavi Pajni ) ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.
మనం డైరెక్టర్ ఏది చెప్తే అది చేయాల్సి ఉంటుంది.సినిమాను కొద్దికొద్ది భాగాలుగా చిత్రీకరిస్తూ పోయారు.
కానీ చివరికి ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు.సినిమాలోని వివాదాస్పద సంభాషణలు తొలగించినప్పటికీ ఒక హిందువుగా ఆ డైలాగులు విని నేను కూడా ఆవేదన చెందానఅని చెప్పుకొచ్చాడు లావ్ పజ్నీ.
సూపర్ లాంగ్ అండ్ షైనీ హెయిర్ కోసం ఇది ట్రై చేయండి..!