బడులను గుడులుగా మార్చిన ఆదిపురుష్ కేటీఆర్.. ఎమ్మెల్యే రసమయి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బడులను గుడులుగా మార్చిన కేటీఆర్ ఆదిపురుష్ అని కొనియాడారు.గతంలో తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో ఆంధ్రకేసరి అని ఉండేదన్న ఎమ్మెల్యే రసమయి తెలంగాణ చరిత్ర ఏ పాఠ్యాంశంలో కనిపించేది కాదని చెప్పారు.
పాఠ్య పుస్తకం తెరవగానే మా తెలుగుతల్లికి కనిపించేది అని, కానీ అందులో అన్ని అబద్ధాలేనని పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చాకే రాష్ట్ర చరిత్ర పుస్తకాల్లో చేరిందని తెలిపారు.
బాలయ్య బోయపాటి కాంబో మూవీలో కళ్యాణ్ రామ్ హీరోయిన్.. ఆ బ్యూటీకి ఛాన్స్ దక్కిందా?