‘జై శ్రీరామ్’ ఫుల్ సాంగ్ కు టైం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో 'ఆదిపురుష్( Adipurush )' ఒకటి.

ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇటు హిందీ మార్కెట్ లో మాత్రమే కాదు తెలుగు మార్కెట్ దగ్గర కూడా మాసివ్ ఓపెనర్ గా నిలిచే సినిమాగా ఇది రాబోతుంది.

ఈ అవైటెడ్ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్దీ సినిమా నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.

జనవరిలోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా జూన్ 16న వాయిదా వేశారు.మరి రిలీజ్ కు ఇంకా నెల కూడా లేకపోవడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు.

ప్రతీ అకేషన్ కు పోస్టర్స్ తో పాటు, ఫస్ట్ సింగిల్, ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ చేసారు.

ట్రైలర్ తో అంచనాలు భారీగా పెంచుకున్న ఈ సినిమా నుండి ''జై శ్రీరామ్'' అనే ఫస్ట్ సింగిల్ ప్రోమో ఇప్పటికే రిలీజ్ చేసారు.

"""/" / ఈ సాంగ్ కు కూడా మేకర్స్ నుండి భారీ స్పందన లభించింది.

ఇక ఇప్పుడు జై శ్రీరామ్( Jai Shri Ram ) ఫుల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది.

ప్రోమో అప్పుడే రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యం అజయ్ - అతుల్ సంగీతంలో మిళితం అయ్యి జై శ్రీరామ్ అనే సాంగ్ గూస్ బంప్స్ తెప్పించింది.

ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

"""/" / ఈ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేసారు.

కొద్దిసేపటి క్రితం మేకర్స్ జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ ను మే 20న రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేసారు.

చూడాలి ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.ఇక రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించగా టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఈ సినిమాలో ప్రభాస్ ( Prabhas )రాముడి పాత్రలో నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది.

అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.

చూడాలి మరి ఈ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో.

వామ్మో.. కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని జ‌బ్బులా..?