1000 కోట్లు సాధించడమే లక్ష్యం గా వస్తున్న ఆదిపురుష్…
TeluguStop.com
బాహుబలి( Bahubali ) సినిమాతో ప్రభాస్ రెంజ్ మారిపోయింది.ఇప్పుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
ఇక తాజాగా ఆయన హిరోగా నటించిన చిత్రం ఆదిపురుష్( Adipurush )’ వచ్చే నెల 16 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల కాబోతున్నది .
ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి .జూన్ 6 వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చెయ్యబోతున్నారు.
ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మైథలాజికల్ మూవీ త్రీడీ ఎఫెక్ట్స్ లో విజువల్ గ్రాండియర్ గా రూపొందుతుంది .
"""/" / ఇక ఈ విజువల్ ఫీస్ట్ ని ఎంజాయ్ చేయడం కోసం ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రామాయాణం కథ ఆధారంగా తెరకెక్కుతోన్న మూవీ కావడంతో .వార్ సీక్వెన్స్ అదిరిపోయే విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, రెండు సాంగ్స్ ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యాయి.
దీంతో మూవీపై భారీగా హైప్ క్రియేట్ అయ్యింది.కచ్చితంగా వెయ్యి కోట్లు కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
ఇక ఆదిపురుష్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రీరిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించబోతున్నారు.
ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.అందుకోసం ఏకంగా 200 మంది డాన్సర్స్, 200 మంది గాయకులని ఆహ్వానించినట్టు తెలుస్తుంది.
"""/" /
వారంతా స్టేజ్ మీద పాటలతో అలరిస్తారని తెలుస్తోంది.అలాగే ఆదిపురుష్ ఈవెంట్ ఏర్పాటు చేసే మైదానం అంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయే విధంగా స్టేజ్ డెకరేషన్ చేయబోతున్నారని సమాచారం .
అదే సమయంలో అంతంటా శ్రీరామ నామం ప్రతిద్వనించే విధంగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారని టాక్.
అలాగే ఫైర్ క్రాక్స్ పైకి వెళ్ళిన తర్వాత జైశ్రీరామ్ సౌండ్ వ్యాపించేలా ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది .
వీటికోసమే లక్షల్లో ఖర్చు చేస్తున్నారని సమాచారం .ఇక ఆదిపురుష్ చిత్ర యూనిట్ మొత్తం ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని కూడా అంటున్నారు .
కి ఈ ఈవెంట్ కోసం కోటి నుంచి రెండు కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు అని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు రిలీజ్ హక్కులని సొంతం చేసుకోవడంతో ప్రీరిలీజ్ ఈవెంట్ బాద్యత కూడా వారే చూసుకుంటున్నారని తెలుస్తుంది .
ఈ ఈవెంట్ తో మూవీకి మరింత హైప్ రావడం ఖాయమని చెప్పవచ్చు .
నేను ధనవంతురాలిని కాదు….నా దగ్గర సహాయం చేసేంత డబ్బు ఉంది: సాయి పల్లవి