Jhansi : ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఝాన్సీ భారీ రెమ్యూనరేషన్.. కానీ అదే మిస్ అయ్యిందిగా?
TeluguStop.com
యాంకర్స్ అంటేనే ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి.వాళ్ళు ఏదైనా ప్రోగ్రాంలో కానీ, సినిమాలో ఈవెంట్లలో కానీ పాల్గొన్నప్పుడు ప్రారంభం నుండి చివరి వరకు అలాగే యాంకరింగ్ చేస్తూ ఉండటం చూసే వాళ్లకు బోరింగ్ గా అనిపిస్తుంది.
అదే మధ్య మధ్యలో కాస్త ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తుంటే ఆ ఈవెంట్ మొత్తం సరదాగా సాగినట్లు అనిపిస్తూ ఉంటుంది.
అయితే యాంకర్ ఝాన్సీ విషయంలో కూడా ఇదే జరిగినట్లు తెలిసింది.రెమ్యూనరేషన్ భారీగా తీసుకున్న కూడా ఆమె నుండి చాలా మిస్ అయింది అని అంటున్నారు చూసిన ప్రేక్షకులు.
ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.అటు బుల్లితెరపై, ఇటువంటి వెండితెరపై నటిగా, యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ( Jhansi ) గురించి అందరికీ పరిచయమే.
ఎన్నో సినిమాలలో సహాయ పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లలో నటించింది.
ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది.ఇక ఈమె యాంకర్ గా కంటే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
చాలా వరకు యాంకర్ సుమను( Anchor Suma ) టార్గెట్ చేసింది ఝాన్సీ.
కానీ సుమను మించలేకపోయింది.ఇక ఈమె తొలిసారిగా సింహాచలం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఆ తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఈమెకు ఎగిరే పావురమా, జయం మనదేరా, ఫ్యామిలీ సర్కస్, ప్రియమైన నీకు, పెళ్లయిన కొత్తలో వంటి సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి.
"""/" /
ఇక యాంకర్ గా బుల్లితెర పై ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలను చేసింది.
సినీ ఈవెంట్ లలో కూడా యాంకర్ గా చేసింది.ఇక సుమ తనకు గట్టి పోటీ గా ఉండటంతో యాంకరింగ్ కెరీర్ కు కాస్త దూరంగా ఉండిపోయింది.
కేవలం సినిమాలలో మాత్రమే నటించాలని ఫిక్స్ అయింది.కానీ అప్పుడప్పుడు సుమ లేనప్పుడు సినీ ఈవెంట్లలో ఈమెనే యాంకరింగ్ చేస్తూ కనిపిస్తుంది.
"""/" /
కానీ నిజానికి సుమ చేసే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది.అయితే రీసెంట్గా సుమ విదేశాలలో ఉండటంతో.
ఆది పురుష్( Adi Purush ) ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చేయలేకపోయింది.
దీంతో ఈ అవకాశం యాంకర్ ఝాన్సీ తో పాటు ప్రదీప్ కు వచ్చింది.
నిజానికి వీరిద్దరు ఉన్నా కూడా అంత ఎంటర్టైన్మెంట్ సాగలేదు ఆ ఈవెంట్లో.ఇక ఈవెంట్ చూసిన వాళ్లంతా ఈవెంట్ మొత్తం భారీగా ఉన్నప్పటికీ కూడా అందులో యాంకర్ సుమ ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ల ద్వారా అంటున్నారు.
"""/" /
ఝాన్సీ చివరి వరకు వార్తలలో చదివినట్లుగా అనిపించిందని బాగా ట్రోల్ చేశారు.
ఈమె ఈవెంట్ కు ఏకంగా రూ.1,10,000 తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రదీప్ రూ.50 వేలు తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక ప్రదీప్ కూడా భాష పరంగా చాలా ఇబ్బంది పడుతూ కనిపించాడు.ఇక మధ్య మధ్యలో ఝాన్సీ వాటిని హ్యాండిల్ చేసినప్పటికీ కూడా హోస్ట్ ల వల్ల కాస్త బోరింగ్ అనిపించింది అని అంటున్నారు.
ఏదేమైనా ఎంటర్టైన్మెంట్ విషయంలో యాంకర్ సుమ తర్వాత ఎవరైనా అని చెప్పాలి.ఆది పురుష్ వల్ల సుమ లేని లోటు తెలిసింది అని అంటున్నారు జనాలు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న సర్దార్ గబ్బర్ సింగ్.. ట్రెండింగ్ కు కారణాలివే!