‘ఆదిపురుష్’ మొదటి వారం వసూళ్లు..మొత్తం ఎంత నష్టం వచ్చిందంటే!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన 'ఆదిపురుష్'( Adipurush ) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అభిమానులు ఆశించిన స్థాయి కి రీచ్ కాలేకపోయినా సంగతి అందరికీ తెలిసిందే.

రామాయణం మీద ఇటీవల కాలం లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సూపర్ స్టార్ తో ఒక్క సినిమాని కూడా తెరకెక్కించలేదు మన మేకర్స్.

అందుకే ఆదిపురుష్ చిత్రం పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఏర్పడ్డాయి.

దానికి తోడు టీజర్ , ట్రైలర్ మరియు పాటలతో ఈ సినిమా ఆడియన్స్ మరింత నాటుకుపోయింది.

విడుదలకు ముందు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఉన్న ప్రతీ ప్రాంతం లో అడ్వాన్స్ బుకింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగాయి.

ముఖ్యంగా హిందీ లో అయితే ఈ ఏడాది షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన 'పఠాన్'( Pathaan ) తర్వాత అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ ని సొంతం చేసుకున్న ఇండియన్ సినిమాగా బాలీవుడ్ లో చరిత్ర సృష్టించింది.

"""/" / ఆ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం వల్ల ఈ సినిమాకి మొదటి మూడు రోజులు కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి.

నెగటివ్ రివ్యూస్ ఇచ్చిన క్రిటిక్స్ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.

వచ్చిన టాక్ ఏమిటి, అక్కడ వస్తున్నా వసూళ్లు ఏమిటి, ఎమన్నా సంబంధం ఉందా అని ప్రభాస్( Prabhas ) స్టామినా ని చూసి నోరెళ్లబెట్టారు.

కానీ నాల్గవ రోజు నుండి మాత్రం వసూళ్లు ట్రేడ్ ఊహించిన దానికంటే ఎక్కువ డ్రాప్ అయ్యాయి.

అలా రోజు రోజు కి డ్రాప్ అవుతూ ఈ సినిమా 7 వ రోజుకు వచ్చేసరికి కోటి రూపాయిల కంటే తక్కువ వసూళ్లను రాబట్టే స్థాయికి పడిపోయింది.

ఇప్పటి వరకు ఈ సినిమా విడుదలై వారం రోజు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము.

తెలుగు మరియు హిందీ భాషలకు కలిపితే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు( Adipurush Movie Collections ) వచ్చినట్టు తెలుస్తుంది.

"""/" / అందులో షేర్ వసూళ్లు దాదాపుగా 175 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా.

వీటిలో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి 75 కోట్ల రూపాయిల వరకు వచ్చి ఉంటుందని అంచనా.

ఇక హిందీ వెర్షన్ కి కలిపి 60 కోట్లు ఉంటుందట.ఇదంతా కేవలం ఇండియా కి సంబంధించిన వసూళ్లు మాత్రమే, ఓవర్సీస్ కూడా కలిపి 175 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట.

తెలుగు మరియు హిందీ వసూళ్లు పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నప్పటికీ తమిళం, కన్నడ మరియు మలయాళం వెర్షన్ వసూళ్లు మాత్రం చాలా దారుణంగా వచ్చాయి,ఈ భాషల్లో కనీసం ఓపెనింగ్ రికార్డుకి కూడా నోచుకోలేదు ఈ సినిమా.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 250 కోట్ల రూపాయలకు జరిగింది.

అంటే ఇంకా 75 కోట్ల రూపాయిలు రాబట్టాలి అన్నమాట, ఈ వీకెండ్ పూర్తి అయితే లాంగ్ రన్ వరకు మరో 15 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చే అవకాశం ఉందంట.

అంటే 65 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అన్నమాట.

తాను చనిపోయినా 10 మంది జీవితాల్లో వెలుగు నింపిన బాలిక.. తల్లీదండ్రులు గ్రేట్ అంటూ?