శక్తిమాన్ ను డైరెక్ట్ చేయనున్న ఆదిపురుష్ డైరెక్టర్.. ఈసారి కూడా సౌత్ హీరోకే ఛాన్స్?

బాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లలో ఓం రౌత్ ఒకరు.ఈయన బాలీవుడ్ లో ముందుగా ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చారు.

ప్రొడ్యూసర్ గా సక్సెస్ కొట్టిన తర్వాత డైరెక్టర్ గా మారి సినిమాలు చేస్తూ డైరెక్టర్ గా కూడా సక్సెస్ కొట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

సిటీ ఆఫ్ గోల్డ్ హాంటెడ్ 3డి సినిమాలు ఓం రౌత్ నిర్మించారు.ఇక ఆ తర్వాత ఈయన లోక్ మాన్య ఏక్ యుగ్ పురుష సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.ఇక ఈ సినిమా తర్వాత ఓం రౌత్ తానాజీ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు.

ఈ సినిమా వల్లీ ఈయనకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వరించింది అని చెప్పాలి.

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ ఆదిపురుష్ అనే పీరియాడిక్ సినిమాను తెరకెక్కించిన విషయం విదితమే.

ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న రెండేళ్ల క్రితమే ఈ సినిమా ముంబై లో ప్రత్యేకమైన సెట్స్ లో తెరకెక్కించారు.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించ నున్నాడు.ఈ పాత్ర కోసం డార్లింగ్ చాలా కష్టపడ్డాడు.

"""/" / ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.ఇది 3డీ వెర్షన్ కావడంతో అభిమానవులంతా సంతోషంగా ఉన్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా జానకి పాత్రలో కృతి సనన్ నటిస్తుంది.

లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.

ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్లకు పైగానే ఖర్చు చేసారు.

"""/" / ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఓం రౌత్ శక్తిమాన్ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

శక్తిమాన్ ఇప్పటికే సీరియల్ రూమ్లో వచ్చి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరించింది.

ఇక ఇప్పుడు ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద తీసుకు రావాలని సోనీ పిక్చర్స్ సంస్థ భావిస్తుంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ఈ సినిమాను ఓం రౌత్ డైరెక్ట్ చేయనున్నాడు.

ఈ మూవీ త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నట్టు టాక్ బాలీవుడ్ మీడియాలో వినిపిస్తుంది.

మరి ఈ సినిమాలో హీరోగా మళ్ళీ సౌత్ హీరోకు ఛాన్స్ ఇస్తారా లేదంటే బాలీవుడ్ హీరోలను తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

కువైట్‌‌కు అండగా నిలుస్తాం .. ప్రవాస భారతీయులతో నరేంద్ర మోడీ