ఆదిపురుష్ ఫస్ట్ డే @95 కోట్లు.. సరికొత్త చరిత్ర సృష్టించిన ప్రభాస్!
TeluguStop.com
ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా ''ఆదిపురుష్''( Adipurush ).
ఈ సినిమా కొద్ది రోజులుగా నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ సినిమాల్లో ఇది ఒకటి.
గత నాలుగు రోజుల నుండి ఆదిపురుష్ మానియా దేశాన్ని ఊపేస్తోంది.మరి ఎట్టకేలకు నిన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
"""/" /
దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ( Bollywood Hero Saif Ali Khan ) రావణాసురుడిగా నటించగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు.
ఈ మాసివ్ ప్రాజెక్ట్ జూన్ 16న అంటే నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
అన్ని చోట్ల మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది.ఈ సినిమాకు రిలీజ్ ముందు భారీ హైప్ పెరుగగా 240 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.
ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 120 కోట్ల మేర బిజినెస్ చేసి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ స్టామినా మరోసారి రుజువు చేసింది.
ఇలా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్స్ లో రిలీజ్ చేసారు.
అందుకే మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ సినిమా మొదటి రోజు మాసివ్ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.
"""/" /
మరి ఇంకా అఫిషియల్ అప్డేట్ అనేది రాకపోయినా ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 100 కోట్లకు చేరువలో కలెక్షన్స్ రాబట్టినట్టు టాక్.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 58.50 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు చేయగా.
మిగిలిన అన్ని భాషల్లో కలిపి మొత్తంగా 95 కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం బయటకు వచ్చింది.
మరి మరి కాసేపట్లో అఫిషియల్ అప్డేట్ వస్తే కానీ ఎన్ని కోట్లు రాబట్టిందో చెప్పలేం.
ఏది ఏమైనా ప్రభాస్( Prabhas ) మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించినట్టే.
వైరల్ వీడియో: అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!