'ఆదిపురుష్'పై అలాంటి కామెంట్స్ చేసిన సినిమాటోగ్రాఫర్.. అవన్నీ నిజమే అంటూ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ''ఆదిపురుష్''.

ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.

సీతగా కృతి సనన్ నటిస్తుంది.లంకేశ్వరుడు రావణాసురిడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించగా.

లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటించాడు.ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చెయ్యగా భారీ ట్రోలింగ్ చేసిన విషయం తెలిసిందే.

ఓం రౌత్ రామాయణం మొత్తం మార్చి తీసారని పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి.

భారీ ట్రీట్ ఉంటుంది అని అనుకున్న ఫ్యాన్స్ అందరిని ఓం రౌత్ నిరాశ పరిచాడు.

ఇంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ రావడంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో నుండి తప్పిస్తూ జూన్ 16కు వాయిదా వేశారు.

"""/"/ ప్రేక్షకులకు పూర్తిగా అద్భుతమైన విజువల్ అనుభూతి ఇవ్వడం కోసం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

ఇక ఈ సినిమాపై రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.ఇక తాజాగా ఈ సినిమా టీజర్ పై ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన కార్తీక్ పళని స్పందించారు.

ఈయన తాజాగా తమిళ్ మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

"""/"/ ''ఈ సినిమా టీజర్ కు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన మాట నిజమే అని అయితే ఈసారి మరింత మెరుగ్గా విజువల్స్ ను తీర్చిదిద్దుతున్నట్టు.

అలాగే ఈసారి అవుట్ పుట్ ప్రతీ ఒక్కరిని మెప్పిస్తుంది అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కొద్దిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈసారి ఆదిపురుష్ అందరి అంచనాలు అందుకుని ప్రభాస్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచి పోతుందో లేదో వేచి చూడాలి.

మరోసారి వెండితెర సందడికి సిద్ధమైన యాంకర్ సుమ…. హిట్ కొట్టేనా?