Kriti Sanon : చాలా రోజులుగా ఆ విషయం దాచాను.. సీక్రెట్ చెప్పేస్తాను : కృతి సనన్?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కృతి సనన్‌ ( Kriti Sanon )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మహేష్ బాబు హీరోగా నటించిన 1నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఈమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ( Bollywood )లో కూడా సినిమాలలో నటించి హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది కృతి సనన్.

,/br> """/" / ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనక సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటూ ఉంటుంది కృతి సనన్‌.

ఇటీవల ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా( Adipurush )తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఘనపత్‌ పార్ట్-1లో నటించనుంది.తాజాగా కృతి సనన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నేడు 27న తన బర్త్‌ డే సందర్బంగా ఒక సీక్రెట్‌ను రివీల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

అదేంటో అభిమానులు గెస్ చేయండి అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. """/" / అంతేకాకుండా ఆ వీడియోలో హెచ్‌ లెటర్‌తో మొదలవుతుందని క్లూ ఇచ్చేసింది భామ.

అయితే ఇది చూసిన అభిమానులు బ్యూటీకి సంబంధించి యాడ్ గురించేనా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరేమో ఎవరా లక్కీ గాయ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.కొందరు ఫ్యాన్స్ ఏకంగా ఎవరినైనా పెళ్లి చేసుకుంటున్నావా? లేకపోతే ప్రభాస్ అన్నను పెళ్లి చేసుకోవచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు.

ఇంకొందరు నెటిజన్స్ అయితే కొత్త మూవీ గురించి అప్‌డేట్‌ ఉంటుందని చెబుతున్నారు.అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విషయంపై ఆమె ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.అలాగే ఆ సీక్రెట్ ఏంటో తెలియాలి అంటే ఆమె స్పందించి ఎంతవరకు వేచి చూడాల్సిందే.

ముంబై నటి వేధింపుల కేసు : వారిపై ‘సజ్జల’ పరువు నష్టం దావా