6 రోజుల్లో ఆదిపురుష్ రాబట్టింది ఎంతంటే.. వరల్డ్ వైడ్ లేటెస్ట్ కలెక్షన్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఆదిపురుష్( Adipurush ) ఈ సినిమా జూన్ 16న శుక్రవారం గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

రామాయణం ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా రిలీజ్ అయ్యి మిశ్రమ టాక్ తెచ్చుకుంది.

ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్( Kriti Sanon ) సీత పాత్రలో నటించింది.

స్టార్ హీరో లంకేశ్వరుడు రావణాసురుడిగా నటించగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Om Raut ) తెరకెక్కించాడు.

మొదటి రోజు ఈ సినిమా 140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 300 కోట్ల మార్క్ చేరుకొని అదరగొట్టింది.

"""/" / అయితే సోమవారం కాస్త డల్ అయిన ఆదిపురుష్ 35 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది.

ఇక నాలుగు రోజుల్లో ఆదిపురుష్ 375 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసినట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

ఇక ఆరు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ పై తాజాగా మేకర్స్ మరోసారి పోస్ట్ చేసారు.

మొదటి మూడు రోజులులా కలెక్షన్స్ ఉంటే ఎప్పుడో 500 కోట్ల మార్క్ దాటిపోయేది.

"""/" / కానీ వీక్ డేస్ లో మొత్తం డల్ అవ్వడంతో ఈ సినిమా 6 రోజుల్లో కేవలం 410 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించింది.

ఈ మేరకు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఈ భారీ బడ్జెట్ సినిమా చూడబోతే నష్టాలు తప్పేలా లేదు.

మరి థియేటర్ రన్ ఎప్పటి వరకు కొనసాగుతుందో అప్పటి వరకు అడపాదడపా కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి.

ఇక ఫైనల్ రన్ లో అయితే ఆదిపురుష్ ఎక్కడ ఆగుతుందో చూడాలి.

చిరంజీవికి ఘన స్వాగతం పలికిన బాలయ్య.. చూడటానికి రెండు కళ్లు చాలవంటూ?