ఆదిపురుష్ సినిమా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందా? ఎందుకో తెలుసా ?
TeluguStop.com
ఆది పురుష్.ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం యొక్క టీజర్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై మిలియన్స్ కొద్దీ వ్యూస్ ని సంపాదిస్తోంది.
వాస్తవానికి ఈ టీజర్ విడుదలైన తరువాత మిక్స్డ్ టాక్ వస్తుంది.కొంత మంది ఈ టీజర్ పూర్తిగా కార్టూన్ షో లాగా ఉందని భావిస్తుంటే మరికొందరు యానిమేషన్ చేసినట్టుగా ఉందని చెప్తున్నారు.
ఇక ఒక వర్గం ప్రేక్షకులు అయితే మా ప్రభాస్ ని కావాలనే పాన్ ఇండియా స్టార్ గా వెలగనివ్వకుండా అడ్డుకుంటున్నారు అని గగ్గోలు పెడుతున్నారు.
సరే ఈ విషయాలన్నీ కాసేపు పక్కన పెడితే రాముడంటే ఎలా ఉండాలో, సీత ఎలా ఉండాలో అలాగే రావణాసురుడు ఎలా ఉండాలో మనం ఇప్పటికే అనేక సినిమాల్లో చూసాం.
అందుకే రాముడంటే మనకు నీల మేఘ శ్యాముడే అని ఫిక్స్ అయిపోయాం.దాంతో ఒక్కసారి ఫేర్ కలర్ లో ఉన్న ప్రభాస్ ని చూసి రాముడు అనుకోవడానికి జనాలు సిద్ధంగా లేరు.
అలాగే నామాలు పెట్టుకుని శివ భక్తుడిగా ఉండే రావణాసురుని క్రూరంగా చూపించినా కూడా మన వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే రాముడిని మించిన భక్తుడు రావణాసురుడు.
టీజర్ ను చూసిన చాలా మంది రాముడు, రావణావతారాలు చూసి షాక్ కి గురయ్యారు.
ప్రేక్షకులను ఏమాత్రం ఈ టీజర్ మెప్పించలేకపోయింది. """/"/
బాలీవుడ్ లో పరవాలేదు కానీ తెలుగు సినిమా విషయానికి వచ్చేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ గా ప్రభాస్ ని ఒప్పుకోలేకపోతున్నారు.
ఓం రౌత్ దర్శకుడుగా వస్తున్నా ఈ సినిమా మరి జనాలని ఏమాత్రం మెప్పిస్తుందో లేదో సినిమా విడుదలవుతే కానీ తెలియదు.
2023 లో వస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని ముందే ఊహించేస్తున్నారు.
ఇప్పటికే వరుస పరాజయాలు ప్రభాస్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఇలాంటి తరుణంలో ఆది పురుష్ హిట్ అయితే తప్ప గట్టక్క లేని పరిస్థితి.
మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని నెలపాటు వేచి చూడాలి.
అల్లు అర్జున్ అరెస్టుపై మాట మార్చిన టాలీవుడ్ కమెడియన్… భయపడుతున్నారా?