సందీప్ వంగాకు అంత సీన్ లేదు.. రు.200 కోట్లు ఇచ్చినా చేయను.. నటుడి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
మన దేశంలో నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) ఒకరు.
అయితే సందీప్ రెడ్డి వంగా సినిమాల విషయంలో ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన అదిల్ హుస్సేన్ అనే నటుడు సందీప్ రెడ్డి వంగా ఏమైనా తైవాన్ డైరెక్టర్ అంగ్ లీ కన్నా ఫేమస్ డైరెక్టర్ అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు.
సందీప్ రెడ్డి వంగా అంతలా ఊహించుకుంటే నేనేం చేయలేనని ఆయన తెలిపారు. """/" /
కబీర్ సింగ్( Kabir Singh ) మూవీ కలెక్షన్లు నాకు అంతగా తెలియదని అంగ్ లీ తెరకెక్కించిన లైఫ్ ఆఫ్ పై సినిమా మాత్రం 5 వేల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుందని ఆయన పేర్కొన్నారు.
ఈ స్థాయిలో కలెక్షన్లను సందీప్ రెడ్డి వంగా సాధిస్తారని నేను అనుకోవడం లేదని అదిల్ హుస్సేన్ ( Adil Hussain )చెప్పుకొచ్చారు.
సందీప్ రెడ్డి వంగా ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
"""/" /
సందీప్ రెడ్డి వంగా ఏదో ఆవేశంలో వాగేశాడని ఆయన తెలిపారు.
సందీప్ రెడ్డి వంగా కామెంట్లను నేను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని అదిల్ హుస్సేన్ చెప్పుకొచ్చారు.
యానిమల్ సినిమాలో ఏదైనా రోల్ ను సందీప్ ఆఫర్ చేసి ఉంటే మాత్రం చేసేవాడిని కాదని ఆయన అన్నారు.
100 నుంచి 200 కోట్లు ఇచ్చినా నేను చేసేవాడిని కాదని అదిల్ హుస్సేన్ వెల్లడించారు.
అలాంటివి నేను ఎప్పటికీ చేయలేనని ఆయన పేర్కొన్నారు.2012లో విడుదలైన లైఫ్ ఆఫ్ పై సినిమాలో ఒక రోల్ లో అదిల్ హుస్సేన్ నటించిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్లు చేశారు.
కబీర్ సింగ్ సినిమాలో చిన్న పాత్రలో నటించిన అదిల్ హుస్సేన్ గతంలో కూడా సందీప్ రెడ్డి వంగాపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది.