ఆది పురుష్ ఓ విజువల్ వండర్..నటి కృతి సనన్ కామెంట్స్ వైరల్!

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ఈ సినిమా తరువాత తన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి చిత్రం ఆది పురుష్.

రామాయణం ఇతిహాసాల ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ చూసిన అభిమానులు నేటిజెన్లు పెద్ద ఎత్తున టీజర్ పై విమర్శలు కురిపించారు.

రామాయణం వంటి అద్భుతమైన మహాకావ్యం ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో రాముడుతో సహా ఇతరుల పాత్రలను కూడా ఎంతో అవమానకరంగా తీసారంటూ పెద్ద ఎత్తున ఈ సినిమా టీజర్ పై విమర్శలు వెలువతాయి.

ఈ విధంగా ఈ టీజర్ పై విమర్శలు రావడంతో డైరెక్టర్ తిరిగి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నారని అందుకే ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

"""/"/ ఈ విధంగా ఈ సినిమా గురించి ఇలాంటి వార్తలు రావడంతో ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్నటువంటి నటి కృతి సనన్ ఆది పురుష్ సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ.ఆది పురుష్ వంటి గొప్ప సినిమాలో నటించినందుకు తాను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానని ఈమె తెలిపారు.

అయితే ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత ఎన్నో విమర్శలను ఎదుర్కొంది.అయితే టీజర్ చూసి సినిమాని అంచనా వేయకూడదు.

ఆది పురుష్ అందరిని ఆశ్చర్యపరిచే విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంటూ ఈ సందర్భంగా ఈమె ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కృతి సనన్ ఆది పురుష్ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కమెడియన్ లతో ఆడి పాడిన హీరోయిన్స్ వీరే !