ఆర్టికల్ 370 పేరుతొ థాలీ, ఖరీదెంతో తెలుసా!

మీరు వింటున్నది నిజమే ఆర్టికల్ 370 పేరుతో వెజ్ థాలీ,నాన్ వెజ్ థాలీ లను పరిచయం చేస్తుంది ఢిల్లీ లోని ఒక రెస్టారెంట్.

ఇటీవల జమ్మూకాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆ ఆర్టికల్ 370 పేరుతో ఢిల్లీ లో కన్నాట్ ప్లేస్ లోని ఆర్దోర్ 2.

1 అనే రెస్టారెంట్ ఒక ఫుడ్ మెనూ ను స్టార్ట్ చేసింది.దానిలో ఆర్టికల్ 370 వెజ్ థాలీ అంటూ జమ్మూకాశ్మీర్ వాసులకు ఒక ఆఫర్ ప్రకటించింది.

అన్ని రాష్ట్రాల రుచులందించే సూపర్‌ సైజ్‌ ఆర్టికల్‌ 370 థాలిపై 370 రూపాయల డిస్కౌంట్‌ కూడా ప్రకటించింది.

అయితే ఇది కేవలం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది.జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వ ఐడీ చూపిస్తే ప్రత్యేక తగ్గింపుతో ఆర్టికల్‌ 370 థాలిని అందిస్తోంది.

అయితే మామూలుగా ఈ వెజ్‌ థాలి ధర రూ.2,370 కాగా.

నాన్‌ వెజ్‌ థాలి ధర రూ.2,669గా నిర్ణయించింది.

వెజ్‌ మెనూల్‌ కశ్మీరీ పులావ్‌, ఖమీర్‌ కి రోటీ, నద్రు కీ షమీ, దమ్‌ ఆల్‌, కహ్వా ఉంటాయి.

ఇక నాన్‌ వెజ్‌ మెనూలో కశ్మీరీ పులావ్‌, ఖమీర్‌ కి రోటీ, నద్రు కి షమీ, రోగన్‌ జోష్‌, కహ్వా ఉన్నాయి.

"""/"/ ఆ మధ్య బాలకోట్ స్ట్రైక్స్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి కొంతమంది సూరత్ డిజైనర్లు ఎయిర్ స్ట్రైక్స్ శారీస్ డిజైన్ చేశారు.

చీరలపై యుద్ధవిమానాలు, సైనికులు, ప్రధాని మోదీకి సంబంధించిన చిత్రాల్ని ప్రింట్ చేశారు.అప్పట్లో ఈ చీరలు దేశవ్యాప్తంగా హట్ టాపిక్‌గా మారాయి.

అయితే ఇప్పుడు తాజాగా ఆర్టికల్ 370 రద్దు పై సర్వత్రా చర్చ నడుస్తుండడం తో దానిని కుడా బేస్ చేసుకొని బిజినెస్ చేసేస్తున్నారు జనాలు.