బొప్పాయి తోటల రైతులకు బొప్పాయి పాలతో అదనపు ఆదాయం..!

బొప్పాయి పంటను సాగుచేసే రైతులు( Farmers ) కేవలం బొప్పాయి పండ్ల ద్వారానే కాకుండా బొప్పాయి పాల చెట్ల ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చు.

కాబట్టి బొప్పాయి పంట సాగు విధానంపై అవగాహన కల్పించుకుని బొప్పాయి పంటను సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చుని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

బొప్పాయి కాయల నుండి కారే పాలను మందులు, ఔషధాలు, సౌందర్య క్రిముల తయారీలో ఉపయోగిస్తారు కాబట్టి బొప్పాయి పండ్లకే కాదు బొప్పాయి పాలకు కూడా మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.

తైవాన్ రెడ్ లేడీ రకం బొప్పాయి సాగు( Papaya Cultivation ) చేస్తే ఏకంగా ఒక ఎకరాకు రూ.

2 లక్షల అదనపు ఆదాయం కేవలం బొప్పాయి పాల ద్వారా పొందవచ్చు.బొప్పాయి పంట చివరి దశలో ఉన్నప్పుడు, కాయల బరువు 500 గ్రాముల కంటే తక్కువగా ఉంటే చాలామంది రైతులు తోటలను తీసి వేస్తుంటారు.

"""/" / అలా చేయకుండా బొప్పాయి తోట చివరి దశలో ఉన్నప్పుడు, ఆ కాయల నుంచి పాలు సేకరించి అమ్ముకుంటే అదనపు ఆదాయం పొందవచ్చు.

పాల సేకరణ ఎలా చేయాలో తెలుసుకుందాం.సాధారణంగా బొప్పాయి తోటల్లో చెట్ల నుండి పాల సేకరణ తెల్లవారుజాము నుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే చేయాలి.

బొప్పాయి చెట్టు కింద చెట్టు చుట్టూ ప్లాస్టిక్ కవర్ ( Plastic Cover )తో తయారు చేసిన జల్లెడ లాంటి అట్టను కింద ఉంచాలి.

ముళ్ళకంప లాంటి ఒక వస్తువుతో బొప్పాయి కాయలపై చిన్న చిన్న గాట్లు వేయాలి.

"""/" / ఆ కాయల నుంచి పారే పాలన్నీ కింద ఉన్న ప్లాస్టిక్ సంచుల్లో పడేవిధంగా ఉంచాలి.

కాయలో నుంచి పాలు కారిన కాసేపటికి అవి గడ్డగా మారిపోతాయి.చెట్టు నుండి పాలు కారణం నిలిచిపోయిన తర్వాత గడ్డగా మారిన పాలను ప్లాస్టిక్ క్యాన్లలో నింపాలి.

పాల సేకరణ ముగిసిన తర్వాత తోటల్లో మిగిలి ఉండే పచ్చి బొప్పాయి కాయలను స్వీట్లు, కేక్ల తయారీలో వినియోగించే స్వీట్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

ఒక ఎకరం పొలంలో తీసిన పాలు దాదాపుగా రూ.20వేల వరకు ధర పలుకుతుంది.

2 నెలల్లో జుట్టును దట్టంగా మార్చే పవర్ ఫుల్ సీరం ఇది.. ఈజీగా తయారు చేసుకోండిలా!