పలు గ్రామ పంచాయతీలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్..

రాజన్న సిరిసిల్ల జిల్లా: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించడంలో భాగంగా బోయినిపల్లి మండలంలోని కొదురుపాక, వెంకట్రావుపల్లి, నర్సింగాపూర్, రామన్నపేట జగ్గారావు పల్లి, మల్కాపూర్, అనంత పల్లి, బూరుగుపల్లి, గ్రామాలను త్రిసభ్య కమిటీ సభ్యులు సందర్శించారు.

పలు రికార్డులను తనిఖీ చేశారు.జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సత్యప్రసాద్, జిల్లా అదనపై ఎస్పీ చంద్రయ్య, డిఎఫ్ఓ బాలమణి, శుక్రవారం సందర్శించారు.

గ్రామపంచాయతీలోనీ రికార్డులను పరిశీలించి గ్రామంలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

హరితహారం, డంపింగ్ యార్డ్, వైకుంఠధామాలు, పారిశుద్ధ్యం, ఇతర వాటిని పరిశీలించారు వీటి ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగ తిలక్ ఉన్నారు.

Méthodes De Paiement Et PayPal : Guide Pratique Pour Joueurs Français