కొనుగోళ్లు వేగవంతం చేయాలి – కొనుగోలు కేంద్రాల పరిశీలనలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.
బోయినపల్లి మండలం కొదురుపాక, విలాసాగర్ లోని ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కల్పించిన వసతులు, రిజిస్టర్లు తనిఖీ చేసి, పలు సూచనలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని సేకరించాలని, ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు.
లారీల కొరత లేకుండా చూసుకోవాలని, రైస్ మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దించుకోవాలని ఆదేశించారు.
రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.
ఇక్కడ జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్, తహసీల్దార్ పుష్పలత, అధికారులు, కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
వైరల్: పాము, ముంగీస ఫైటింగ్ చూడండి… అరాచకం అంతే!