బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ హోం మేడ్ ప్రోటీన్ షేక్‌ను చేరిస్తే..మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు!

ప్రోటీన్‌.శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అతి ముఖ్య‌మైన పోష‌కం.

బ‌రువు అదుపులో ఉండాల‌న్నా, మెద‌డు చురుగ్గా ప‌ని చేయాల‌న్నా, చ‌ర్మం నిగారింపుగా మెరవాల‌న్నా, జుట్టు ఒత్తుగా పెర‌గాల‌న్నా, గుండె ప‌ని తీరు స‌క్ర‌మంగా జ‌ర‌గాల‌న్నా ప్రోటీన్ ఎంతో అవ‌స‌రం.

అలాగే మ‌రెన్నో విధాలుగా కూడా ప్రోటీన్ మ‌న ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.అందుకే చాలా మంది మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ప్రోటీన్ పౌడ‌ర్స్‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

కానీ, మార్కెట్‌లో దొరికే ప్రోటీన్ పౌడ‌ర్స్ కంటే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ హోం మేడ్ ప్రోటీన్ షేక్‌ను బ్రేక్ ఫాస్ట్‌లో చేర్చుకుంటే.

ఇక మీ ఆరోగ్యానికి తిరుగే ఉండ‌దు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ప్రోటీన్ షేక్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్‌, వ‌న్ టేబుల్ స్పూన్ స‌త్తు పౌడ‌ర్‌, గుప్పెడు వేయించి పొట్టు తొల‌గించిన వేరుశెన‌గ‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల బెల్లం, ఒక గ్లాస్ సోయా పాలు లేదా బాదం పాలు వేసుకుని బాగా క‌లుపుకోవాలి.

ఆపై మూత పెట్టి నైట్ అంతా నాన‌బెట్టుకోవాలి.ఉద‌యాన్నే బ్లెండ‌ర్ తీసుకుని అందులో నాన‌బెట్టుకున్న ప‌దార్థాల‌న్నిటినీ పాల‌తో స‌హా వేసుకుని గ్రైండ్ చేసుకుంటే సూప‌ర్ టేస్టీ అండ్ హెల్తీ హోం మేడ్ ప్రోటీన్ షేక్ సిద్ధ‌మైన‌ట్లే.

"""/"/ ఈ ప్రోటీన్ షేక్‌ను రోజుకొక గ్లాస్ చప్పున ప్ర‌తి రోజు బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలో తీసుకుంటే.

ఆరోగ్యానికి చాలా మేలు జ‌రుగుతుంది.ముఖ్యంగా బ‌రువు త‌గ్గ‌డానికి ప్ర‌య‌త్నించే వారికి ఇది బెస్ట్ ప్రోటీన్ షేక్‌గా చెప్పుకోవ‌చ్చు.

దీనిని డైట్‌లో చేర్చుకుంటే వేగంగా బ‌రువు త‌గ్గుతారు.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా మారుతుంది.

ఎముక‌లు, కండ‌రాలు బ‌లంగా మార‌తాయి.నీర‌సం, అల‌స‌ట వంటివి దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

మ‌రియు క్యాన్స‌ర్‌, గుండె పోటు, ఆల్జీమ‌ర్స్ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధులు వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గుతుంది.

వైరల్ వీడియో: ఏంటి ఈవిడ సూట్ కేసును ఇలా తినేస్తుంది..