ప్రసవం తర్వాత వేగంగా బరువు తగ్గాలంటే దీన్ని డైట్‌లో చేర్చాల్సిందే!
TeluguStop.com
ఎంత సన్నగా ఉన్న వారైనా ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరిగి లావుగా మారడం సర్వసాధారణం.
అయితే ప్రసవం అనంతరం దాదాపు అందరూ మునుపటి మాదిరిగా సన్నగా మారడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.
కఠినమైన డైట్ ను ఫాలో అవుతుంటారు.మీరు ఈ జాబితా లో ఉన్నారా? అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే.
ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల ప్రసవం తర్వాత వేగంగా వెయిట్ లాస్ అవుతారు.
మరి ఇంతకీ ఆ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి.? మరియు ఎప్పుడు తీసుకోవాలి.
? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక చిన్న కీర దోసకాయ, ఒక పైనాపిల్, రెండు ఉసిరి కాయలు, పుచ్చకాయ తీసుకుని.
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అర కప్పు కీర దోసకాయ ముక్కలు, ఒకటిన్నర కప్పు పుచ్చకాయ ముక్కలు, ఒక కప్పు పైనాపిల్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి కాయ ముక్కలు వేసుకోవాలి.
వాటితో పాటుగా వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం, రెండు టేబుల్ స్పూన్ల తేనె, చిటికెడు నల్ల ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్ సిద్ధమయినట్టే.
ప్రసవం అనంతరం ఈ జ్యూస్ ను రోజులో ఏదో ఒక సమయంలో తీసుకుంటే శరీరంలో పేరుకు పోయిన కొవ్వు, క్యాలరీలు త్వరగా కరుగుతాయి.
వేగంగా బరువు తగ్గుతారు. """/"/
పైగా ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు లభిస్తాయి.
బాడీ లో పేరుకు పోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.
రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.సీజనల్ వ్యాధులు సైతం దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
సాంకేతిక లోపంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు..