ఐనాక్స్ సత్వా నెక్లెస్ మాల్ వద్ద హైదరాబాద్‌లో ఐనాక్స్ 4వ మల్లీప్లెక్స్‌ను తెరిచిన నటుడు అడవి శేష్
TeluguStop.com
ఈ నూతన సినిమాలో ఏడు స్ర్కీన్‌లు ఉంటాయి.మొత్తంమ్మీద 103 విలాసవంతమైన రిక్లెయినర్స్‌తో పాటుగా 1534 సీట్లు ఉంటాయి హైదరాబాద్‌లో 26 స్ర్కీన్‌లతో 4 మల్టీప్లెక్స్‌లను ఐనాక్స్ నిర్వహిస్తోంది ఈ ఏడు స్ర్కీన్‌లూ డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్‌ను కలిగి ఉండటంతో పాటుగా సినీ ప్రేమికులకు లీనమయ్యే శబ్ద అనుభవాలను అందిస్తాయి ఈ మల్టీప్లెక్స్‌ను ‘మేజర్’ చిత్ర నటుడు అడవి శేష్, దర్శకుడు శశి కిరణ్ తిక్క లు ప్రారంభించారు.
హైదరాబాద్, 13 మే2022 ః భారతదేశపు అగ్రగామి మల్టీప్లెక్స్ సంస్ధ ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ (ఐనాక్స్) నేడు హైదరాబాద్‌లో తమ 4వ మల్లీప్లెక్స్‌ను సత్వా నెక్లెస్ మాల్ వద్ద ప్రారంభించింది.
ఈ మాల్ కవాడీగూడా మెయిన్ రోడ్, సికింద్రాబాద్ వద్ద ఉంది.ఈ నూతన మల్టీప్లెక్స్‌లో 7 ఆకర్షణీయంగా డిజైన్డ్ ఆడిటోరియాలు ఉంటుంది.
మొత్తంమ్మీద 1534 సీట్లు కలిగిన ఈ మల్టీప్లెక్స్‌లో 103 విలాసవంతమైన రీక్లైనర్ సీట్లు ఉన్నాయి.
ఐనాక్స్ ఇప్పుడు నాలుగు మల్టీ ప్లెక్స్‌లను 26 స్ర్కీన్‌లతో హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది.
ఈ మల్టీప్లెక్స్‌లోని ఏడు స్ర్కీన్స్ కూడా సౌకర్యవంతమైన అనుభూతులను అందించడంతో పాటుగా అత్యున్నత శ్రేణి సినిమా సాంకేతికతలను సౌండ్, ప్రొజెక్షన్ కోసం కలిగి ఉన్నాయి.
రేజర్ –షార్ప్ విజువల్స్ కోసం అత్యాధునిక డిజిటల్ ప్రొజెక్షన్ సిస్టమ్‌ను ఈ ఆడిటోరియా కలిగి ఉంది.
లీనమయ్యే వాతావరణం కలిగి ఉన్న ఆడిటోరియా, ఆహ్లాదకరమైన 3డీ వ్యూను అందిస్తుంది.దీనికి వోల్ఫోనీ స్మార్ట్ క్రిస్టల్ డైమండ్ సొల్యూషన్ తోడ్పాటునందిస్తుంది.
ఈ మల్టీప్లెక్స్‌లో డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఏడు స్ర్కీన్‌లలోనూ అందుబాటులో ఉంది.
తద్వారా సినీ అభిమానులు ఉరుములతో కూడిన శబ్ద అనుభవాలను పొందగలరు.సినిమా యొక్క వ్యక్తీకరణ మరియు సమకాలీన డిజైన్ అతిథులను ఆహ్వానించే రీతిలో ఉండటంతో పాటుగా సినిమా అంతటా గ్రాండ్ అట్రియం చుట్టుకుని ఉంటుంది.
ఈ మల్టీప్లెక్స్ యొక్క డిజైన్ భాష అత్యున్నతంగా సున్నితమైన రూపాలు మరియు పంక్తులతో చక్కగా వివరించబడింది ఇది సరళతను విఛ్చిన్నం చేయడంతో పాటుగా స్పేస్‌ను అత్యన్నతంగా తీర్చిదిద్దింది.
ఈ సినిమాలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా ఉంది.దీనికి చక్కగా సరిపోయేలా కిడ్డెల్స్ అంటూ పేరు పెట్టారు.
చిన్నారుల కోసం ప్రకాశవంతమైన, ఉత్సాహవంతమైన ప్లే ఏరియా ఇది.దీనిలో బొమ్మలు, పుస్తకాలు, సంబంధిత యాక్టివిటీలు మరియు యువ అతిథులకు అవసరమైన కంటెంట్ అందుబాటులో ఉంటాయి.
ఇవి యువ అతిథులు సినిమా వద్ద పూర్తి ఆహ్లాదకరమైన అనుభూతులను పొందడంలో సహాయపడతాయి.
ఈ సినిమాలో రిక్లెయినర్ సీటింగ్ కూడా ఉంది.ఇది అత్యంత విలాసవంతమైన, సౌకర్యవంతమైన సినిమా వీక్షణ అనుభవాలను హైదరాబాద్‌లోని సినీ అభిమానులకు అందించనుంది.
ఈ మల్టీప్లెక్స్‌లో విస్తృతశ్రేణిలో వినియోగదారుల అనుకూల డిజిటల్ ఫీచర్లు అయినటువంటి పేపర్ లెస్ చెక్ ఇన్స్, టచ్ స్ర్కీన్ మరియు క్యుఆర్ కోడ్ ఆధారిత టిక్కెటింగ్ , ఇంటరాక్టివ్ ఫుడ్ ఆర్డరింగ్ వంటివి లభిస్తాయి.
అత్యంత ఆకర్షణీయమైన లైవ్ కిచెన్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన నోరూరించే వంటకాలను ఇక్కడ ఆస్వాదించవచ్చు.
సినిమా చూడని అతిథులు కూడా ఇక్కడి వంటకాల రుచుల ఆస్వాదన చేయవచ్చు.
తమ ప్రత్యేకమైన కోల్డ్ కాఫీలు , షేక్స్‌కు సుప్రసిద్ధమైన ఐనాక్స్ ఇప్పుడు చెఫ్స్ స్పెషల్ శాండ్‌విచ్‌లు, బర్జర్స్, ఫ్రైలు, నాచోస్ , పసందైన పిజ్జాలు వంటి వాటిని నిపుణులైన చెఫ్‌లు, బరిస్టాస్ తయారుచేస్తారు.
ఐనాక్స్ అభిమానులు ఈ విస్తృతశ్రేణి రుచుల ఆస్వాదనను తమ ఇంటి నుంచి స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్‌ఫామ్‌లపై ఆర్డర్ చేయడం ద్వారా ఆస్వాదించవచ్చు.
ఈ ప్రారంభం గురించి ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ రీజనల్ డైరెక్టర్ – సౌత్ , మోహిత్ భార్గవ మాట్లాడుతూ ‘‘ఈ 7 స్ర్కీన్ సినిమా ఆధునిక విలాసం, అధునాతన సినిమా సాంకేతికతలు మరియు సమృద్ధిగా రుచులను అందించే ఆహార ఎంపికలతో కూడిన అనుభవాలు అందిస్తుంది.
సికింద్రాబాద్ పరిసరాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా గమ్యస్దానంగా ఇది మారనుంది.
ముత్యాల నగరిలో మా 4వ సినిమాను తెరువడం ద్వారా హైదరాబాద్‌లో అమిత ఆసక్తి కలిగిన సినీ అభిమానులను స్వాగతిస్తున్నాము మరియు ఈ వినూత్న అనుభవాల ద్వారా వారికి ఆహ్లాదం పంచనున్నాము.
ఈ స్ర్కీన్‌ల ప్రారంభంతో తెలంగాణాలో మా కార్యకలాపాలు మరింత విస్తృతం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.
ఈ ప్రారంభంతో, ఐనాక్స్ దేశవ్యాప్తంగా 72 నగరాలలో 688 స్ర్కీన్‌లను 162 మల్టీప్లెక్స్ ద్వారా కలిగి ఉంది.
దూకుడు పెంచిన ఐటీ అధికారులు…దిల్ రాజుతో పాటు మైత్రి పై ఐటి దాడులు?