తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..!

తెలంగాణ రాష్ట్రానికి( Telangana State ) మరో భారీ పెట్టుబడి రానుంది.ఈ మేరకు రాష్ట్రంలో రూ.

12,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది.కాగా దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో( CM Revanth Reddy ) అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ( Gautam Adani ) భేటీ అయ్యారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు రంగాల్లో రూ.12,400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ సంస్థ తెలిపింది.

"""/" / పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉపాధి కల్పన నేపథ్యంలో కొత్త కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారని సమాచారం.

అయితే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అదానీ గ్రూప్( Adani Group ) ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో అదానీ సంస్థ ప్రతినిధులు చర్చలు సైతం జరిపారు.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?