జగన్ కు అదానీ లంచాలా ? క్లారిటీ ఇచ్చిన వైసీపీ
TeluguStop.com
భారత్ లో అత్యంత సంపన్నుడిగా, బిజెపి కేంద్ర పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన గౌతం అదానీ( Gautam Adani ) పై అమెరికాలో కేసు నమోదు వేయడం, ఎస్బిఐ దర్యాప్తు జరుగుతుండడం, ఈ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి( YSR Congress Party ) చెందిన పెద్దలు ఉన్నట్లుగా ఆరోపణలు రావడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.
ఏపీలో సౌరశక్తి ప్రాజెక్టుల( Solar Energy Projects ) కోసం గత వైసిపి ప్రభుత్వ పెద్దలకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రూ.
1750 కోట్ల మీద లంచాలు ఇచ్చినట్లు అమెరికా కోర్టులో ఎస్బిఐ దర్యాప్తు ఆధారంగా నమోదు చేసిన అభియోగాలపై వైసీపీ స్పందించింది.
ఈ ఒప్పందాల విషయంలో అసలు ఏం జరిగిందనేది పూర్తిగా క్లారిటీ ఇచ్చింది .
మేరకు వైసిపి తరఫున ఒక ప్రకటన విడుదల అయింది.దీంట్లో సౌరశక్తి ఒప్పందాలపై అసలు ఏం జరిగింది? అసలు లంచాలు స్వీకరించడానికి ఆస్కారం ఉందా లేదా అనే విషయాలు పూర్తి క్లారిటీ ఇచ్చింది.
"""/" /
ఏపీ విద్యుత్ సంస్థలు వ్యవసాయ రంగానికి సంవత్సరానికి 12,500 మెగావాట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం పంపిణీ వినియోగాలకు ఆ విద్యుత్ కు సంబంధించిన సరఫరా ఖర్చు మేరకు పరిహారం చెల్లిస్తుందని వైసిపి తెలిపింది.
ఏపీలో గత ప్రభుత్వాల విధానాల కారణంగా అధిక టారిఫ్ లతో విద్యుత్ ఒప్పందాలు అమలు చేశారని , రాష్ట్ర డిస్కంల పై ఇవి ప్రభావం చూపకుండా పంపిణీ వ్యయంలో భాగంగా విద్యుత్ కొనుగోలు ఖర్చు దాదాపు రూ కిలో వాట్ కు 5.
10 చప్పున చెల్లించడం ప్రభుత్వానికి భారంగా మారిందని వెల్లడించింది. దీనిని పరిష్కరించేందుకు , ఈ వ్యయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో 2020లో అప్పటి వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి చేసే సోలార్ పార్కులలో 10 వేల మెగా వాట్ల సోలార్ సామర్ధ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
ఏపీ జి ఈ సీ ఎల్ ద్వారా నవంబర్ 2020లో 6,400 మెగావాట్ల సౌరశక్తి అభివృద్ధి కోసం టెండర్లు పిలిచిందని తెలిపింది.
"""/" /
దీంట్లో 24 బిడ్లు కిలోవాట్ కు 2.49 నుంచి 2.
58 చెల్లించేలా వచ్చాయి.టెండర్ కు చట్టపరమైన , నియంత్రణ పరంగా ఎదురైన అడ్డంకులతో ఈ ప్రయత్నం ఫలించలేదని తెలిపింది .
ఆ తరువాత వైసిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సేకీ నుంచి 7 మెగావాట్ల విద్యుత్ కిలోవాట్ కు 2.
49 చొప్పున 25 ఏళ్ల కాలానికి కొనుగోలు చేసే నిర్ణయం తీసుకున్నట్లు వైసిపి తెలిపింది.
దీంట్లో కిలో వాట్ కు 2.49 చొప్పున 2024 25 లో 3,000 మెగా వాట్లతో ప్రారంభించి, 2025 - 26లో మూడువేల మెగావాట్లు, 2026 27లో 1000 మెగావాట్లు ఇచ్చేలా నిర్ణయించినట్లు పేర్కొంది.
దీనిని ఏపీఈఆర్సీ కూడా ఆమోదించినట్లు వెల్లడించింది తరువాత కేంద్ర ఈఆర్సి ఆమోదంతో 2021 డిసెంబర్ 1 న సెకి, ఏపీ డిస్కం ల మధ్య ఒప్పందం జరిగినట్లు పేర్కొంది.
తరువాత ఏపీ డిస్కం లు( AP Discom ) ఆదాని గ్రూప్ కు చెందిన వాటితో సహా ఏ ఇతర సంస్థల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని పేర్కొంది.
అందువల్ల అమెరికాలో ఆడానిపై అభియోగపత్రం నేపథ్యంలో అప్పటి తమ వైసిపి ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాదని వైసిపి పేర్కొంది.
పవర్ స్టార్ ఓజీ కర్ణాటక హక్కుల వివరాలివే.. రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయిగా!