రెండు తెలుగు సినిమాలు ఓకే చేసిన ఆదా శర్మ
TeluguStop.com
హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ ఆదా శర్మ.
మొదటి సినిమాతోనే ఒకే అనిపించుకున్న ఈ అమ్మడు తరువాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుందని అందరూ భావించారు.
అయితే ఈమెకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.వచ్చిన కూడా ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.
అయితే అడవి శేష్ హీరోగా వచ్చిన క్షణం సినిమాలో ఆమె చేసిన పాత్రతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది.
ఆ సినిమా తర్వాత అవకాశాలు పెరుగుతాయని అనుకున్న అది వర్క్ అవుట్ అవ్వలేదు.
ఇక రాజశేఖర్ తో కల్కీ సినిమాలో హీరోయిన్ గా ఆదా శర్మ నటిస్తుంది.
అయితే సినిమాలో ఆమె పాత్రకి అసలు ప్రాధాన్యత లేకుండా పోయింది.ఇక హిందీలో కూడా ఈ అమ్మడుకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.
సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్ లతో ఎప్పటికప్పుడు సందడి చేస్తూ అందాల ప్రదర్శన చేస్తున్న కూడా ఈమె వైపు చూస్తున్న దర్శకులు లేరు.
ఈ హాట్ ఫోటో షూట్ ల కారణంగా ఇంస్టాగ్రామ్ లో ఫాలోయింగ్ మాత్రం పెరుగుతుంది.
అయితే ఈ కరోనా టైంలో ఊహించని విధంగా ఈ అమ్మడుకి రెండు రోజుల వ్యవధిలో రెండు తెలుగు సినిమా ఆఫర్లు వచ్చాయి.
ఈ రెండు సినిమాలు థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కే లేడీ ఒరియాంటెడ్ కథలే కావడం విశేషం.
లో బడ్జెట్ సినిమాలు అయినా లేడీ ఒరియాంటెడ్ సినిమాలు కావడం ఆదాశర్మకి కొంత కలిసొచ్చే విషయం.
ఈ సినిమాలతో ఈ అమ్మడు తనని తాను ఎంత వరకు ప్రూవ్ చేసుకుంటుందో అనేది వేచి చూడాలి.
పురాణాలను మోడర్న్‌గా చూపించగల ఏకైక డైరెక్టర్ బాపు.. ఆ సినిమాతో ప్రూవ్ అయ్యిందిగా..?