విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య గొడవలకు కారణం ఏంటో చెప్పేసిన ఆర్కే సెల్వమణి?

ఇటీవల జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన పరస్పర విమర్శలపై ప్రముఖ దర్శకుడు ఆర్‌.

కె.సెల్వమణి ఈ విధంగా స్పందించారు.

ప్రకాశ్ రాజ్ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, అలాగే విష్ణు ఫాథర్ మోహన్ బాబు చాలా చాలా మంచి ఫ్రెండ్ అని ప్రముఖ దర్శకుడు ఆర్‌.

కె.సెల్వమణి చెప్పుకొచ్చారు.

నాకే కాదు వాళ్లక్కూడా తను మంచి స్నేహితుడు అన్న సెల్వమణి, తన భార్యతో కూడా వారు చాలా సన్నిహితంగా ఉంటారని ఆయన అన్నారు.

ఇద్దరూ మంచివాళ్లే.కానీ ప్రజల దృష్టిలో ఒక దేవుడిగా ఉన్నపుడు ఈ పోస్ట్ నథింగ్ అని ఆయన చెప్పారు.

మోహన్ బాబు విష్ణు అంటే ఒక గొప్పతనం ఉంటుంది.హీరో విష్ణు అంటే ఒక గొప్పతనముంటుంది.

కానీ ప్రెసిడెంట్ విష్ణు అంటే ఏం గొప్పతనం ఉంది అని ఆయన ప్రశ్నించారు.

"""/"/ ఇక ఏమీ లేని పోస్ట్ కోసం మన ఫ్రౌడ్‌ను, స్టేటస్‌ను ఎందుకు కిందకు దించుకోవాలని సెల్వమణి అన్నారు.

నిజానికి ప్రకాశ్ రాజ్ ఒక నేషనల్ ఆర్టిస్ట్.అది తమిళ్‌ గానీ, తెలుగులో గానీ అది లోకల్, నాన్‌ లోకల్‌ అంటున్నారు కానీ, అవన్నీ ఏం కావు.

అతను నాన్‌ లోకలే కానీ ఇప్పడివరకు ఆయన ఎంతో మందిని తన నటనతో, కామెడీతో చాలా మందినీ అలరించారని సెల్వమణి అన్నారు.

ఎన్నో పాత్రలో నటించడమే కాదు, ఏకంగా జీవించేశారని చెప్పారు.కేవలం ఈ పోస్ట్ కోసం వీరిద్దరూ ఇలా విమర్శించుకోవడం ఏంటని ఆయన అన్నారు.

"""/"/ ఇకపోతే విష్ణుతో అంత పరిచయం లేదు కానీ, దాదాపు 30ఏళ్ల నుంచి మోహన్ బాబు తనకు తెలుసన్న సెల్వమణి, వారిద్దరూ ఈ పోస్ట్ కంటే 1000 రెట్లు చాలా పెద్ద వాళ్లని ఆయన సంభోదించారు.

"""/"/ ప్రైమ్ మినిష్టర్ పోస్ట్ కోసం పోటీ పడ్డారంటే ఏమో గానీ, దానిక్కూడా ఇన్ని గొడవలు జరగవని ఆయన చెప్పారు.

అసలు ఇది ఒక ఎలక్షన్‌లా కాకుండా ఒక వార్‌లాగా అనిపించిందని ఆయన అన్నారు.

దాని వల్ల వారిద్దరి క్యారెక్టరూ బ్యాడ్ అవుతుందని ఆయన చెప్పారు.అసలు ప్రకాష్ రాజ్ ఏం అడిగినా ఇచ్చేస్తాడన్న సెల్వమణి, దీని కోసం ఆ క్యారెక్టర్‌ను పోగొట్టుకోకూడదని ఆయన చెప్పారు.

ఇకపోతే వారిద్దర్లో ఎవరొచ్చినా ఇద్దరూ అన్నీ చేస్తారని, అసలు అక్కడ ఏమీ చేయలేనీ పోస్టా అని ఆయన ప్రశ్నించారు.

వారిద్దరికీ ఒక రిక్వెస్ట్ చేస్తానని, మీరిద్దరూ ఆ పోస్ట్‌ కన్న చాలా ఎక్కువ విలువ కలవారని, దాని కోసం మీ క్యారెక్టర్‌ను దిగజార్చుకోకూడదని చెప్పుకొచ్చారు.

ఇక పోతే ఈ మధ్య రసవత్తంగా సాగిన మా ఎలక్షన్స్‌లో మంచు విష్ణు విజయం సాధించగా, ప్రకాశ్‌ రాజ్ ఓటమిని ఎదుర్కోక తప్పలేదు.

అనంతరం జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఆయన మా మెంబర్ షిప్‌కు రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే6, సోమవారం 2024